పాపం దావూద్‌ పేద కానిస్టేబుల్‌ కుమారుడు: రియా తండ్రికి బాలీవుడ్ మేకర్‌ కౌంటర్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ ఆత్మహత్య కేసులో నటి రియా, ఆమె కుటుంబం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే

పాపం దావూద్‌ పేద కానిస్టేబుల్‌ కుమారుడు: రియా తండ్రికి బాలీవుడ్ మేకర్‌ కౌంటర్‌
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2020 | 6:20 PM

Sushant Case updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ ఆత్మహత్య కేసులో నటి రియా, ఆమె కుటుంబం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ కుటుంబం సైతం రియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటం, అందులో రియా సోదరుడు షోవిక్‌ని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేయడంపై ఆమె తండ్రి ఇంద్రజిత్ స్పందించారు.

”కంగ్రాట్స్ ఇండియా. మా కుమారుడిని అరెస్ట్ చేశారు. నెక్ట్స్ నా కూతురు లైన్‌లో ఉందని అర్థమవుతోంది. మధ్యతరగతి కుటుంబాన్ని నాశనం చేశారు. న్యాయం కోసం అందరికీ న్యాయం జరుగుతోంది. జైహింద్” అని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ స్టేట్‌మెంట్‌పై బాలీవుడ్‌ ఫిలిం మేకర్ అశోక్‌ పండిట్ కౌంటర్ ఇచ్చారు. ”ఎంత బాధ కలిగించే విషయం. దీన్నిచూస్తుంటే నాకు కొన్ని గుర్తు వస్తున్నాయి. టెర్రరిస్ట్ బుర్హాన్‌వని తండ్రి ఓ స్కూల్ టీచర్‌, అలాగే అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తండ్రి ఓ పేద కానిస్టేబుల్ కుమారుడు” అని కామెంట్ పెట్టారు. కాగా సుశాంత్‌ కేసుపై బాలీవుడ్‌లోకి కొందరు మాత్రమే స్పందిస్తున్నారు. అందులో కొంతమంది సుశాంత్ కుటుంబానికి మద్దతును ఇస్తుంటే, మరికొందరు రియాకు మద్దతు తెలుపుతున్నారు.

Read More:

ఇంగ్లండ్‌లో కత్తిపోట్ల ఘటన: నిందితుడు అరెస్ట్

‘అల’ వచ్చిన పేరు ‘వి’లా పోయింది

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..