Breaking News
  • నగరంలో కొనసాగుతున్న శిధిల భవనాలు కూల్చివేత. ఈ నెల 12 నుండి నేటి వరకు వారం రోజుల్లో (59) శిధిలభవనాలను కూల్చివేసినట్లు జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. నగరంలో గుర్తించిన 545 శిధిల భవనాలకు నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. ఈ సీజనులో మొత్తం 287 శిధిల భవనాలు కూల్చి వేసినట్లు తెలిపారు. మరో 33 శిధిల భవనాలను ఖాళీ చేయించి,వాటిలో నివసిస్తున్న 140 మందిని తరలించినట్లు తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున శిథిలభవనాలలో ఉంటున్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
  • తిరుమల: టిటిడి బంగారం డిపాజిట్ల‌పై వివరణ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం డిపాజిట్ చేయడం వెనుక ఎలాంటి రహస్య అజెండా లేదు. టిటిడి ఒకటిన్నర దశాబ్దానికి పైగా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 2.5% వడ్డీ ప్రకారం దీర్ఘకాలిక ప్రాతిపదికగానే బంగారాన్ని ఉంచాలని టిటిడి ధర్మకర్తల మండలి తీర్మానించింది. అయితే, గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో ఎక్కువ మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానమైనది. ఇప్పటికి కూడా దీర్ఘకాల ప్రాతిపదికన పెద్ద మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించేందుకు చాలా బ్యాంకులు ముందుకు రావడం లేదు. ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇలాంటి స్టేట్ బ్యాంకులో టిటిడి ద‌శాబ్ధ కాలానికి పైగా బంగారం డిపాజిట్లు చేస్తోంది. ఈ బ్యాంకులో దాదాపు 7,800 కిలోల బంగారం డిపాజిట్లు ఉంచ‌డం అన్న‌ది స్టేట్ బ్యాంకుతో టిటిడికి ఉన్న దీర్ఘ‌కాలిక బ్యాంకు లావాదేవీల అనుబంధాన్ని తెలియ‌జేస్తోంది. దీర్ఘకాల ప్రాతిపదికన బంగారం డిపాజిట్లు స్వీకరించేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంగీకరించలేదు. దీనితో పాటు ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని మరియు 6 నెలల సమయం కావాలని టిటిడిని కోరింది. ఈ 6 నెలల కాలానికి గాను దీర్ఘకాలిక గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ కింద ఇతర బ్యాంకులు ఇస్తున్న 2.5% వడ్డీని తాము కూడా 6 నెలలకు చెల్లిస్తామని సదరు బ్యాంకు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు నిర్ణయించిన మేరకు దీర్ఘకాలిక ప్రాతిపదికగా టిటిడి బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం జరిగింది. ....టిటిడి.
  • విజయవాడ: దివ్య తేజస్విని హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. సోషల్ మీడియా పోస్టులు , సెల్ఫీ వీడియో , కాల్ డేటా ఆధారాలతో పోలీసులు విచారణ. భీమవరంలో దివ్య చదినవిన ఇంజినీరింగ్ కాలేజికి వెళ్లిన పోలీసులు. దివ్య స్నేహితుల నుంచి కీలక ఆధారాలు సేకరణ. పెళ్లి జరిగి ఫోటో ఆధారంగా తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో పోలీసు బృందాలు విచారణ. హత్యకు ముందు దివ్య, నాగేంద్రల మధ్యన సాగిన ఫోన్ రికార్డులను హైదరాబాద్ పంపిన పోలీసులు. నాగేంద్ర తరపున ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాగేంద్రకు ఎవరైనా సహాయ పడ్డారా అనే కోణంలో దర్యాప్తు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు నాగేంద్ర.
  • అమరావతి: ఇవాళ బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన. 56 బిసి కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రకటించనున్న ప్రభుత్వం. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు. 30వేల పైబడి జనాభా కలిగిన బిసి కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం . పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. పురుషులుకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌ పదవులు దక్కే ఛాన్స్.
  • చెన్నై : తమిళ సినీ పరిశ్రమ కి దర్శకుడు భారతి రాజా డిమాండ్ . కరోనా కారణముగా నిలిచిపోయిన సినిమా షూటింగ్ లను పునరుద్ధరించాడానికి అందరూ ముందుకు రావాలి . తెలుగు, మలయాళం , సినీ పరిశ్రమలో నటి , నటులు , టెక్నిషియన్స్ , వారుగా ముందుకొచ్చి పారితోషకం లో 30 నుండి 40 శాతం తగ్గించుకున్నారు . తమిళ పరిశ్రమకి చెందిన నటి , నటులు , టెక్నిషియన్స్ , 10 లక్షలకు పైన పారితోషకం తీసుకుంటున్న వారు 30 నుండి 50 శాతం వారి పారితోషకం తగ్గించుకోవాలి . పరిశ్రమ లో ఉన్న అగ్ర నటి , నటులు ,ముందుకు రాకపోతే నిర్మాతలు రోడ్డున పడతారు.ఇతర పరిశ్రమలో నటి , నటులు , నిర్మాతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు సగం లోనే ఆగిపోయాయి. వాటిని మళ్ళీ మొదలు పెట్టాలంటే పరిశ్రమలో ఉన్న అందరు నిర్మాతలకు సహకరించాలి. ప్రస్తుతం నిర్మాతలను కాపాడుకోకపోతే తమిళ పరిశ్రమ పూర్తిగా నష్టాలపాలవుతుందని దర్శకుడు భారతి రాజా హెచ్చరిక .

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం !

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండవచ్చునని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టుకు తెలియజేసింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక,

dawood ibrahim role in kerala gold smuggling case, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో దావూద్ ఇబ్రహీం !

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉండవచ్చునని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టుకు తెలియజేసింది. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసిందని ఈ సంస్థ వెల్లడించింది. స్వప్న సురేష్, శివశంకర్ తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు టాంజానియాలో డైమండ్ బిజినెస్ ఉందని బంగారాన్ని యూఏఈ లో అమ్మానని నిందితుల్లో ఒకడైన రమీస్ చెప్పినట్టు ఎన్ఐ ఏ వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం పాత్రపై  అమెరికా విదేశాంగ శాఖ ప్రచురించిన ఫాక్స్ షీట్ ప్రకారం ఐరాస భద్రతామండలి ఆంక్షల కమిటీ ఈ విషయాన్ని పేర్కొన్నట్టు ఈ సంస్థ తెలిపింది.

 

Related Tags