అరుదైన రికార్డు పై కన్నేసిన వార్నర్..!

ఐపీఎల్ 12వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం వార్నర్ ఐపీఎల్‌లో కొత్త రికార్డుపై కన్నేశాడు. ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరిగే మ్యాచ్‌లో వార్నర్ మరో అర్ధశతకం సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు అర్ధశతకాలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం సెహ్వాగ్‌, జోస్‌ బట్లర్‌తో సమానంగా వరుసగా ఐదేసి అర్ధశతకాలు సాధించాడు. వార్నర్‌ గత ఐదు మ్యాచుల్లో చూస్తే చెన్నైపై (57 పరుగులు), […]

అరుదైన రికార్డు పై కన్నేసిన వార్నర్..!
Follow us

|

Updated on: Apr 27, 2019 | 8:47 PM

ఐపీఎల్ 12వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం వార్నర్ ఐపీఎల్‌లో కొత్త రికార్డుపై కన్నేశాడు. ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరిగే మ్యాచ్‌లో వార్నర్ మరో అర్ధశతకం సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు అర్ధశతకాలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం సెహ్వాగ్‌, జోస్‌ బట్లర్‌తో సమానంగా వరుసగా ఐదేసి అర్ధశతకాలు సాధించాడు. వార్నర్‌ గత ఐదు మ్యాచుల్లో చూస్తే చెన్నైపై (57 పరుగులు), కోల్‌కతాపై (67 పరుగులు), చెన్నైపై (50 పరుగులు), ఢిల్లీపై (51 పరుగులు), పంజాబ్‌పై (71 పరుగులు) చేశాడు.

ఇకపోతే వార్నర్ కన్నా ముందు సెహ్వాగ్ 2012, జోస్ బట్లర్ 2018లో వరుసగా ఐదేసి అర్ధ శతకాలు సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్‌ మరో అర్ధశతకం సాధిస్తే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం వార్నర్‌ ఉన్న ఫామ్‌ చూస్తే ఈ ఫీట్ సాధించడం పెద్ద కష్టమేమి కాదని సన్ రైజర్స్ అభిమానులు అంటున్నారు.