Varun Dhawan On Marriage Plan: చిన్ననాటి స్నేహితురాలిని ఇష్టపడి.. కష్టపడి ప్రేమకు ఒప్పించి.. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న హీరో

సినీ పరిశ్రమలో వరస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. గత ఏడాదిలో కరోనా వైరస్ భయం వెంటాడుతున్నా వరసగా ప్రముఖులు పెళ్లి పీటలు ఎక్కారు.. ఇక ఈ ఏడాది కూడా కొంతమంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటామంటూ..

Varun Dhawan On Marriage Plan: చిన్ననాటి స్నేహితురాలిని ఇష్టపడి.. కష్టపడి ప్రేమకు ఒప్పించి.. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న హీరో
Follow us

|

Updated on: Jan 10, 2021 | 1:28 PM

Varun Dhawan On Marriage Plan: సినీ పరిశ్రమలో వరస పెళ్లిళ్లతో సందడి నెలకొంది. గత ఏడాదిలో కరోనా వైరస్ భయం వెంటాడుతున్నా వరసగా ప్రముఖులు పెళ్లి పీటలు ఎక్కారు.. ఇక ఈ ఏడాది కూడా కొంతమంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటామంటూ ప్రకటిస్తున్నారు. ముహర్తాలు పెట్టుకుంటున్నారు. ఈ ఏడాదిలో ముందుగా యంగ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి ముహర్తం పై క్లారిటీ ఇచ్చాడు.

ఈ హీరో పెళ్లి గురించి దాదాపు రెండేళ్ల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రేపో మాపో పెళ్లి అంటూ చర్య నడుస్తూనే ఉంది. దీంతో వరుణ్ ధావన్ తాజాగా వివరణ ఇచ్చాడు. తన పెళ్లి ఎప్పుడు అంటూ అందరూ రెండేళ్ల నుంచి అడుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా గందరగోళంలో ఉంది. పరిస్థితులు చక్కబడి అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాదే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నటాషాతో ఏడడుగులు వేస్తానని ప్రకటించాడు.

వరుణ్ ధావన్ తన ప్రేమ విషయం పంచుకుంటూ.. చిన్ననాటి స్నేహితురాలైన నటాషాను ప్రేమలో పడెయ్యడానికి సినిమాల్లో పడినన్ని కష్టాలు పడ్డానని చెప్పాడు. తన ప్రేమని ప్రపోజ్ చేసిన ప్రతి సారీ నటాషా రిజెక్ట్ చేసిందని.. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడి మరీ ప్రేమించానని వరుణ్ గతంలో చెప్పాడు.. ఇష్టపడిన అమ్మాయిని కష్టపడి ఒప్పించి మరీ ఇప్పుడు పెళ్లి చేసుకునే వరకూ తీసుకెళ్తున్నాడు వరుణ్ ధావన్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో కపూర్ ఫ్యామిలీ వారసుడు రణ్ బీర్ కపూర్ తాను త్వరలో అలియా భట్ ను పెళ్లి చేకోనున్నాని ప్రకటించగా.. కరోనా నేపధ్యంలో పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Read: మానవత్వం చాటుకున్న కరాటే కళ్యాణి.. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న నటి