Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

రజిత హత్యకేసులో మరిన్ని నిజాలు.. బిత్తరపోతోన్న పోలీసులు..!

కీర్తి.. ఈ పేరు గత మూడు రోజులుగా వార్తల్లో వినిపిస్తున్న పేరు. ప్రేమ మాయలో పడిన కూతురిని.. హెచ్చరించినందుకు తల్లిని చంపేసిన కీర్తి. హైదరాబాద్ హయత్‌నగర్‌లో జరిగిన రజిత హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లుబైర్లుగమ్మే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా.. ప్రియుడు శశితో కలిసి.. కీర్తి మద్యం సేవించిన మత్తులో తల్లిని చంపినట్టు ఒప్పుకుంది. తనతల్లి హత్యకు ప్రియుడు శశే ప్రేరేపించాడని పోలీసుల విచారణలో తెలిపింది. కీర్తి ఇంట్లో మూడు బీరు బాటిళ్లను పోలీసులు స్వాధినం చేసుకున్నారు.

తాజాగా.. కీర్తి.. మరో ప్రియుడు బాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని.. అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు. జనవరిలో కీర్తిపై బలవంతంగా అత్యాచారం చేశాడు బాల్ రెడ్డి. కీర్తి గర్భవతి కావడంతో.. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో.. శశి సహాకరంతో అబార్షన్ చేయించాడు. అయితే.. బాల్ రెడ్డి.. శశి మంచి మిత్రులని అంటున్నారు పోలీసులు. అబార్షన్ చేయించే సమయంలోనే.. శశి కీర్తిని బ్లాక్‌మెయిల్ చేసి లోబరుచుకున్నాడు. అంతేకాకుండా.. నగ్న వీడియోలు తీసి హింసించాడు.

కొంతకాలం తర్వాత బాల్ రెడ్డితో వివాహం చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే కీర్తితో చనువు పెంచుకున్న శశి.. కీర్తిని ప్రేమిస్తున్నట్టు చెప్పగా.. ఆమె నిరాకరించింది. దీంతో.. ఇవన్నీ బయటపెడతా.. అంటూ బెదిరించడంతో.. శశి.. అతనికి లోబడక తప్పలేదు. అప్పటి నుంచీ వీరిద్దరూ.. సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చారు.

అయితే.. ఈ నెల 19న కూరగాయలు తెచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లిన తల్లి రజిత… ఇంటికి తిరిగొచ్చేసరికి కీర్తి ప్రియుడు శశితో కలిసి ఉండటాన్ని చూసి ఇద్దరిని మందలించింది. అయితే, తమ ప్రేమకు అడ్డువస్తున్న రజితను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు స్కెచ్‌ వేశారు. ఇంటిబయటే ఉన్న కారులో ప్లాన్‌ వేసారు. కీర్తిని ఇంటికి పంపిన శశి ఆ తర్వాత మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. ఈలోగా నిద్రిస్తున్న రజితను కీర్తి అరవకుండా దిండుతో మొఖంపై అదిమి పట్టగా… శశి చున్నీతో రజిత గొంతు నులిమి చంపినట్టు ఒప్పుకుంది. ఒక్కగానొక్క కూతురైన కీర్తి శశిని ప్రేమించడం రజితకు ఇష్టం లేదని అదే విషయంలో పలుమార్లు కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.