Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాక్‌ పౌరసత్వం..

వెస్టిండీస్‌‌ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం దక్కబోతుంది. పాకిస్తాన్‌లో మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌కు పూర్వ వైభవం తేవడానికి విశేషమైన కృషి చేసినందుకు సామికి పౌరసత్వం అందజేస్తామని పిసిబి మీడియా విభాగం ఒక ట్వీట్‌లో ప్రకటించింది.
West Indies' Darren Sammy set to get Pakistani Citizenship along with highest civilian award, వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాక్‌ పౌరసత్వం..

వెస్టిండీస్‌‌ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ డారెన్‌ సామికి పాకిస్థాన్ పౌరసత్వం దక్కబోతుంది. పాకిస్తాన్‌లో మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌‌కు పూర్వ వైభవం తేవడానికి విశేషమైన కృషి చేసినందుకు సామికి పౌరసత్వం అందజేస్తామని పిసిబి మీడియా విభాగం ఒక ట్వీట్‌లో ప్రకటించింది. పాకిస్తాన్ అత్యున్నత సివిల్ అవార్డు ‘నిషాన్‌ ఈహైదర్‌ ’తో పాటు, ఆ దేశ గౌరవ పౌరసత్వంను సామీకి..పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి మార్చి 23 న ఇవ్వనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) శనివారం తెలిపింది. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో డారెన్ సామి పెషావర్ జెల్మి జట్టుకు సారథిగా వ్యవహిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు, భద్రతా దృష్ట్యా పాక్‌లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు వెనుకాడుతోన్న వేళ..సామి ముందుకొచ్చి 2017లో పీసిఎల్ ఫైనల్ ఆడాడు. 

దీంతో  సామి చేసిన సాయానికి కృతజ్ఞతగా దేశ గౌరవ పౌరసత్వం ఇవ్వాలని పెషావర్ జెల్మి జట్టు ఆ దేశ అధక్షుడిని కోరింది. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా వేరే దేశ పౌరసత్వం తీసుకున్న మూడో క్రికెటర్‌గా సామి రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. గతంతో మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), హెర్షల్‌ గిబ్స్‌ (సౌతాఫ్రికా)లకు సెయింట్‌ కిట్స్‌ ప్రభుత్వం సిటిజన్‌ షిప్‌ ఇచ్చింది.

.

Related Tags