మరో 36 గంటల్లో ఏపీ, తెలంగాణలకు ఫణి తుఫాన్ ముప్పు..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 36 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్‌కు ఫణిగా నామకరణం చేశారు. ఫణి తుఫాన్ ఈ నెల 30న కన్యాకుమారి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అటు […]

మరో 36 గంటల్లో ఏపీ, తెలంగాణలకు ఫణి తుఫాన్ ముప్పు..
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 12:44 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 36 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్‌కు ఫణిగా నామకరణం చేశారు. ఫణి తుఫాన్ ఈ నెల 30న కన్యాకుమారి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ నెల 28వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అటు తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 30వ తేదీన వాయు గుండం, తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచింది.