కల్తీ శానిటైజర్లతో ఆరోగ్యానికి యమ డేంజర్ !

కరోనా సంక్షోభం వేళ కాసుల కోసం కొందరు వ్యాపారులు నీచానికి తెగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో ఇదే అదనుగా కల్లీ శానిటైజర్లను తయారు చేసి, మార్కెట్లోకి వదులుతున్నారు. శానిటైజర్లలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నాంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం.

కల్తీ శానిటైజర్లతో ఆరోగ్యానికి యమ డేంజర్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 11:07 AM

కరోనా సంక్షోభం వేళ కాసుల కోసం కొందరు వ్యాపారులు నీచానికి తెగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో ఇదే అదనుగా కల్లీ శానిటైజర్లను తయారు చేసి, మార్కెట్లోకి వదులుతున్నారు. శానిటైజర్లలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నాంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం. కరోనా సంక్లిష్ట సమయంలో శానిటైజర్లకు దేశ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది. ప్రజలు ఏదీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున శానిటైజర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రజల బలహీనతను ఆసరగా చేసుకొని కొంత మంది వ్యాపారులు కల్తీ శానిటైజర్లను తయారు చేయడం మొదలు పెట్టారు. శానిటైజర్లలో ప్రమాదకర రసాయనాలు వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాసుల కోసం కొంత మంది ఇలాంటి నీచానికి పాల్పడుతున్నారు. కోవిడ్-19 పరికరాల పేరుతో ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని.. దీనికి సంబంధించి ముందస్తు ఆన్‌లైన్ చెల్లింపులపై సీబీఐ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శానిటైజర్లలో ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో అధికారులు నకిలీ శానిటైజర్ల వ్యాపారంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు జాగ్రత్త లేకపోవడంవల్ల చాలా మంది మోసపోతున్నారని, కొవిడ్ పరికరాలు కొనుగోలు చేసే ముందు ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అక్రమార్కులు ఆన్‌లైన్‌లో ముందస్తుగానే నగదు చెల్లింపులు చేసుకొని పలాయనం చిత్తగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా సరకులు బుక్ చేసుకున్న వారిలో చాలా మందికి అవి డెలివరీ కావట్లేదన్న ఫిర్యాదులు కూడా వస్తున్నట్టు తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఆర్డర్లు చేయించుకొని కస్టమర్లను మోసం చేస్తున్నారని సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.