Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

క్రోన్స్ వ్యాధికి డాన్‌డ్రఫ్ కారణమా..?

, క్రోన్స్ వ్యాధికి డాన్‌డ్రఫ్ కారణమా..?

చాలా మంది వ్యక్తులు చుండ్రుతో బాధపడుతూంటారు. ఇదే డ్రై డ్రాన్‌డ్రఫ్ గా కూడా తయారవుతుంది. దీని వలన చర్మ వ్యాధులు కూడా వస్తాయని మనకు తెలిసిన విషయమే. దీనిని చర్మవ్యాధుల కింద పరిగణిస్తారు. చుండ్రు నివారణకు ప్రస్తుతం చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

అయితే.. ఈ మధ్య చుండ్రుపై ఓ కొత్త పరిశోధన చేయగా.. దీని వలన పేగుకు, జీర్ణాశయంకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని పరిశోధనలో తేలింది. కొత్త అధ్యయనం ప్రకారం క్రోన్స్ అనే వ్యాధికి చుండ్రు కారణమని.. ఇది ఒక ఫంగస్‌తో వస్తుందని తెలిపారు పరిశోధకులు. స్కాల్ఫ్ పైన ఏర్పడే డాన్‌డ్రఫ్ మన శరీరంపై పడుతుందని.. దీనితో అక్కడ మెటిమలు, జిడ్డు చర్మం ఏర్పడుతుందని తెలిసినదే.

, క్రోన్స్ వ్యాధికి డాన్‌డ్రఫ్ కారణమా..?

కాగా.. వీటిపై తాజాగా చేసిన పరిశోధనల్లో జీర్ణాశయంలో ఉండే శిలీంధ్రం మన స్కాల్ఫ్ మీద కూడా ఉందని కనుగొన్నారు. క్రోన్స్‌ వ్యాధితో ఉన్న వ్యక్తులలో ఈ ఫంగస్‌ను తొలగించడం ద్వారా.. మన తలమీద ఉన్న డాన్‌డ్రఫ్‌ నుంచి కూడా ఉపశమనం కలుగుతుందోమోనని అని అనుకున్నారు.

లాస్‌ఏంజెల్స్‌ని సెడర్స్-సినాయ్ హాస్పిటల్లో డేవిడ్ అండర్ హిల్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో కంటే క్రోన్స్ వ్యాధి ఉండే రోగులలో మలాసెజియా ఉండాటాన్ని చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. ఈ బ్యాక్టిరియాపై మైక్రోబయోంపై చాలా పరిశోధనలు చేశాయి. డాక్టర్ అడర్హిల్ బృందం శిలీంధ్రం యొక్క ఉనికిని మురియు పేగు వ్యాధిలో దాని సంభావ్య పాత్రను పరిశీలించింది.

డాక్టర్ జోస్ లిమోన్, ఒక సెడార్స్-సినాయి, రీసెర్చ్ టీం సభ్యుడు చేసిన పరిశోధనల్లో క్రోన్స్ వ్యాధి రోగులలో.. ఈ వ్యాధికి దోహదపడే లక్షణాలను మరింత తీవ్రతరం చేసాయని తెలిపారు. డాక్టర్స్ ఎలుకల మీద ఈ డాన్‌డ్రఫ్ ఫంగస్‌తో పరిశోధనలు చేయగా అవి.. పెద్దపేగు వ్యాధికి కారణమయ్యాని పేర్కొన్నారు. పేగుల్లో ఉండే శిలింధ్రాలు, అలాగే.. అనేక శ్లేష్మ సంబంధిత శిలింధ్రాలు క్రోన్స్ వ్యాధితో బాధపడేవారిలో గణనీయంగా ఉన్నాయని కనుగొన్నారు.

, క్రోన్స్ వ్యాధికి డాన్‌డ్రఫ్ కారణమా..?

కాగా.. ఇది ఎలుకల్లో ఉండే గట్ల వ్యాధికి సంబంధినది కాదని పేర్కొన్నారు. అయితే.. కొన్ని రకాల ప్రేగు వ్యాధులు మలాసెజియాను మరింత దిగజార్చాయని పేర్కొన్నారు.