డ్యాన్సర్‌ను చేస్తామంటూ రూ.5 లక్షలకు టోపీ

సినిమాలో డ్యాన్సర్‌ అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఆ యువతి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాళ్ల ఉదంతం తాజాగా భయటపడింది...

డ్యాన్సర్‌ను చేస్తామంటూ రూ.5 లక్షలకు టోపీ
Follow us

|

Updated on: Jun 18, 2020 | 2:59 PM

“రంగుల ప్రపంచం… కలల ప్రపంచం.. శ్రీదేవిలా ఉన్నావ్.. జయసుధలా నటిస్తున్నావ్…” అంటుంటే హీరోయిన్ అయిపోదామని తెగ ఆరాటపడేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటివారిని నిండా ముంచేందకు గుంటనక్కలు కూడా కాచుకు కూర్చుంటాయి. ఇలాంటి ముఠాకు చిక్కింది విశాఖకు చెందిన ఓ యువతి.

సినిమాలో డ్యాన్సర్‌ అవకాశం ఇప్పిస్తామని చెప్పి ఆ యువతి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాళ్ల ఉదంతం తాజాగా భయటపడింది. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ తనిఖీకి వచ్చిన ఏసీపీ స్వరూపారాణికి ఫిర్యాదు చేసింది.

మురళీనగర్‌ ఎన్‌జీజీఓస్‌ కాలనీకి చెందిన బత్తుల ప్రభావతికి సినిమాల్లో నటించాలని… తాను అద్భుతమైన డ్యాన్సర్ కావాలని కోరిక. ప్రభావతి వీక్ నెస్ ను గమనించిన బొమ్మిడి గీతాప్రసాద్‌, సత్యనారాయణ, షరీఫ్‌లు ఆమెను తమ ముగ్గులోకి దింపారు. తమకు హైదరాబాద్ లోని సినిమా ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయంటూ నమ్మించారు. ఐటమ్‌సాంగ్‌లో డ్యాన్స్ చేసే అవకాశం ఇప్పిస్తామని చెప్పారు.

అంతేకాదు.. ఒక్క ఐటమ్‌సాంగ్‌లో చిందేస్తే రూ.10 లక్షలు ఇస్తారంటూ మోసానికి తెరలేరుపారు. అయితే అందులో రూ.5 లక్షలు తమకు ముందే ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా నిజమని నమ్మిన ప్రభావతి రూ.5 లక్షలు ఆ మూడు గుంటనక్కలకు ముట్టజెప్పింది. డబ్బులు దండుకున్న ఆ ముఠా కనిపించకుండా పోయింది. దీంతో మోసపోయానని గుర్తించి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ వెస్ట్‌జోన్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ జి.స్వరూపారాణితో తన గోడు వినిపించుకుంది. దీనిపై స్పందించిన ఏసీపీ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం