పీక్‌కు చేరిన కులపిచ్చి.. కిందకు జారిన దళితుడి డెడ్ బాడీ

Dalit funeral procession disallowed on upper-caste lands in tamilnadu, పీక్‌కు చేరిన కులపిచ్చి.. కిందకు జారిన దళితుడి డెడ్ బాడీ

అనాదిగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల భూతం మళ్లీ పేట్రేగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బే ఏళ్లుదాటినా.. కులం అడ్డుగోడల్ని ఇంకా పెకిలించలేకపోయింది. తమిళనాడులో జరిగిన అగ్రవర్ణాల కులపిచ్చిని చూస్తే.. ఇంకా మనం ఆధునిక యుగంలో ఉన్నామా.. లేక ఆటవిక యుగంలో ఉన్నామా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో జరిగిన ఓ ఘటన.. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదంటూ అగ్రవర్ణాలు అడ్డగించాయి. దీంతో మరోదారిలేక వంతెన పై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా వనియంపాడికి చెందిన ఎన్‌.కుప్పమ్‌ అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే గ్రామంలోని దళితులకు ప్రత్యేక స్మశానం లేకపోవడంతో.. మృతదేహాలన్నింటిని ఒకేచోట ఖననం చేస్తున్నారు. స్మశానవాటికకి వెళ్లాలంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వారి పొలం మీదుగా వెళ్లాలి. అయితే తమ పొలంలో నుంచి వెళ్లేందుకు వీల్లేదంటూ అక్కడి అగ్రవర్ణాల వారు అభ్యంతరం తెలిపారు. దీంతో రోడ్డుపై నుంచి వెళ్లకుండా 20 అడుగుల ఎత్తు ఉన్న బ్రిడ్జీ నుంచి తాళ్ల సాయంతో మృతదేహాన్ని స్మశానంలోకి దించారు. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *