సెలెక్టర్ల నిర్ణయంపై క్రికెటర్ ఫైర్!

Dale Steyn being ignored for T20I series

టీం ఇండియాతో జరగబోయే టీ20 మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. సెలెక్టర్లు ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంపై డేల్ స్టెయిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పాలని స్టెయిన్ ప్రశ్నించాడు. ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో స్టెయిన్ రాణిస్తున్నాడు. భారత జట్టుతో టీ20ల్లో ఆడలేకపోతున్నందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అభిమానులకు స్టెయిన్ క్షమాపణ చెప్పాడు. దక్షిణాఫ్రికా తరపున 44 టీ20ల్లో 6.79 ఎకానమి రేటుతో స్టెయిన్ 61 వికెట్లను పడగొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *