Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Coffee Benefits: రోజూ కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ రాదట.. పరిశోధనలో బయటపడ్డ నిజాలు..

కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే రోజు గడవదు. అలాంటి వారికి ఒక శుభవార్త. నిత్యం కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తెలిజేశారు...
Daily Coffee Benefits, Coffee Benefits: రోజూ కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ రాదట.. పరిశోధనలో బయటపడ్డ నిజాలు..

Daily Coffee Benefits: కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే రోజు గడవదు. అలాంటి వారికి ఒక శుభవార్త. నిత్యం కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తెలిజేశారు. జపాన్ లోని కనజావా యూనివర్సిటీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు తాజాగా 16 ఎలుకలపై ఈ పరిశోధన చేశారు. వాటికి కాఫీ పౌడర్ ఇచ్చి.. వాటిపై పరిశోధనలు చేశారు.

Also Read: Health Benefits Of Drinking Wine

ఆ పరిశోధన ద్వారా కాఫీలో ఉండే కహావోల్ ఎసిటేట్, కేఫ్ స్టాల్ అనే సమ్మేళనాలు ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని వారు కనుగొన్నారు. అంతేకాదు క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా అవి అడ్డుకుంటాయని గుర్తించారు. అందువల్ల నిత్యం కాఫీ తాగితే.. క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఇక కాఫీ తాగితే క్యాన్సర్ రాదని అదే పనిగా ఎక్కువ సార్లు కాఫీ తాగినా ప్రమాదం అని వారు హెచ్చరిస్తున్నారు. నిత్యం 2 లేదా 3 సార్లు కాఫీ తాగితే ఫర్వాలేదు గానీ అంతకన్నా ఎక్కువ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని సైంటిస్టులు అంటున్నారు.

 

Related Tags