Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

మా కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి..?: పురంధేశ్వరి

, మా కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి..?: పురంధేశ్వరి

నెల్లూరు: తమ కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి అంటూ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీ్ల్లో ఉంటే తప్పులేనప్పుడు తమ కుటుంబం ఉంటే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో సందర్భంగా మీ కుటుంబం మొత్తం వైసీపీలో చేరిందిగా.. మీరెప్పుడు చేరుతున్నారు అన్న విలేకరుల ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు.

, మా కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి..?: పురంధేశ్వరి

ఏపీలో అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసిన పురందేశ్వరి.. కేంద్ర పథకాలను టీడీపీ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మోదీని ఎదుర్కొనేందుకు అవినీతి పార్టీలన్నీ ఒకటి అవుతున్నాయని ఆమె విమర్శించారు. మార్చి 1న మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.