పాకిస్తాన్ లో అమెరికా మహిళ రేపిన ‘తుపాన్’ !

పాకిస్తాన్ లో ఓ అమెరికా మహిళ దుమారం రేపుతోంది. తమ దేశంలో ప్రబలమవుతున్న  కరోనా వైరస్ ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారన్న ప్రచారం కన్నా ఈ మహిళ..

పాకిస్తాన్ లో అమెరికా మహిళ రేపిన 'తుపాన్' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2020 | 3:54 PM

పాకిస్తాన్ లో ఓ అమెరికా మహిళ దుమారం రేపుతోంది. తమ దేశంలో ప్రబలమవుతున్న  కరోనా వైరస్ ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హ్యాండిల్ చేయలేకపోతున్నారన్న ప్రచారం కన్నా ఈ మహిళ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు కల్లోలం రేపుతున్నాయి. ఆమె పేరు సింథియా డేవిడ్ రిచీ.. పాలక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకులతో తనకున్న సంబంధాలను ఆవిడ చిలవలు, పలవలుగా చెబుతుంటే అంతా విస్తుబోయి చూస్తున్నారు. తనను పలువురు రాజకీయ నాయకులు లైంగికంగా ఎలా వేధించిందీ, తనపై అత్యాచారాలకు ఒడిగట్టిందీ సింథియా పూసగుచ్చినట్టు చెబుతోందట. రెహమాన్ మాలిక్, మక్దూమ్ షాహబుద్దీన్, పాక్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో సహా చాలామంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతోంది.  సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఈమె అమెరికా నుంచి పాకిస్థాన్  చేరింది. రెండు మూడేళ్ళ క్రితం అప్పటి ఓ సైనికాధికారి ఈమెను దేశానికి ‘పరిచయం’ చేశాడు. వివిధ  పార్టీలతోను ఆయనకున్న సంబంధాలు సింథియాకు కూడా ప్రయోజనం కలిగించాయి. ఇక తానే నేరుగా పొలిటికల్ లింకులు పెట్టుకుంది. అయితే ఆమె చేస్తున్న ఆరోపణలను నమ్మడానికి ప్రజలు సిధ్ధంగా లేకున్నా.. ఒక విధంగా కరోనా వైరస్, దాని అదుపులో ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాన్నిమించిపోయి.. ఎవరి నోటా విన్నా ఇవే హాట్ టాపిక్ లా మారాయి. ఒక విదేశీ మహిళ ఇక్కడికొచ్చి తన వ్యక్తిగత విశేషాలన్నీ చెబుతుంటే ప్రజలంతా వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. విపరీతంగా  ఆసక్తి చూపుతున్నారు.   ఇదంతా ఇలా ఉండగా.. పాక్ సైన్యం.. కావాలనే కరోనా వైరస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, తమ ప్రధాని వైఫల్యాన్ని కప్పి పుచ్చడానికి ఈమెను ఓ సాధనంలా వాడుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి.