Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

పెను తుఫాన్‌గా మారిన ‘వాయు’.. పటిష్ట భద్రత..!

, పెను తుఫాన్‌గా మారిన ‘వాయు’.. పటిష్ట భద్రత..!

గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి. నేవీ, కోస్ట్‌ గార్డ్, ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపారు. 54 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరావళ్ తీర ప్రాంతంలో జాలర్ల కుటుంబాలను ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీచ్‌లలోకి జనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమ్‌నాథ్ ఆలయానికి కూడా భక్తులు రావద్దని అధికారులు సూచించారు. కాగా.. గుజరాత్‌లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వాయు తుఫాన్ కారణంగా భారీగా నష్టం జరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ముందుగా రక్షణా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. గుజరాత్, విరావళ్‌కు వచ్చే వివిధ రైళ్లకు కూడా రద్దు చేశారు.

కాగా.. పశ్చిమ తీరం వెంట ఇంకా హై అలెర్ట్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రక్షణ చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ ప్రభావాన్ని కేంద్రం పర్యవేక్షిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే.. తుఫాన్‌తో ఎటువంటి నష్టం జరగకూడదని ప్రార్థించారు మోదీ. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.