ముంచుకొస్తున్న నివార్.. తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితిపై మోదీ ఆరా.. అన్ని విధాలుగా సాయపడతామని భరోసా

నివార్ తుఫాను ముంచుకొస్తోన్న నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితి పై ప్రధాన మంత్రి మోదీ ఆరాతీసారు. అక్కడి పరిస్థితులను గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి..

ముంచుకొస్తున్న నివార్.. తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితిపై మోదీ ఆరా.. అన్ని విధాలుగా సాయపడతామని భరోసా
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Nov 24, 2020 | 2:36 PM

నివార్ తుఫాను ముంచుకొస్తోన్న నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరీల్లో పరిస్థితి పై ప్రధాన మంత్రి మోదీ ఆరాతీసారు. అక్కడి పరిస్థితులను గురించి తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి వి. నారాయణసామితో మోదీ మాట్లాడారు. ‘నివార్ తుఫాను ఫలితంగా తలెత్తిన స్థితి పై తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామితో, పుదుచ్చేరీ ముఖ్యమంత్రి వి.నారాయణసామితోను మాట్లాడాను.. కేంద్రం తరఫున అన్ని విధాలుగా సాయపడతామంటూ హామీని ఇచ్చాను.. ప్రభావిత ప్రాంతాలలో నివసించే వారు భద్రంగా, క్షేమంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.’ అని ట్విటర్ ద్వారా ప్రధాన మంత్రి వెల్లడించారు.

ఇలా ఉంటే, నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశల్లో ప్రయాణించి మంగళవారం ఉదయం 5.30కు తుఫానుగా మారింది. పుదుచ్చేరికి తూర్పు, ఆగ్నేయ దిశగా 410 కి.మీ.లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 450 కి.మీ.ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులోని కరైకల్-మామల్లాపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో బుధవారం సాయంత్రం తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని దాటనుందని తెలుస్తోంది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 కి.మీ.ల నుంచి గరిష్టంగా 120 కి.మీ.ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.