ఏపీ ప్రజలకు తుఫాన్ హెచ్చరిక.. మరికొన్ని గంటల్లో తీరంను తాకనున్న నివార్..

నివార్ ప్రస్తుతం బెంగాల్ బేలోని పుదుచ్చేరికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరం అధికంగా ఉన్న…

  • Sanjay Kasula
  • Publish Date - 5:26 pm, Mon, 23 November 20

Cyclone Nivar  : నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాను నవంబర్ 25 మధ్యాహ్నం కరైకల్ మరియు మహాబలిపురం వద్ద తీరంను తాకుతుందని తెలిపింది. ఆ సమయంలో తమిళనాడు తీరంలో కొండచరియలు విరిగిపడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 29-30 ° C పరిధిలో ఉన్నాయి.

నివార్ ప్రస్తుతం బెంగాల్ బేలోని పుదుచ్చేరికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నవంబర్ 23 సాయంత్రం నాటికి తీవ్ర మాంద్యం.. నవంబర్ 24 ఉదయం తుఫానుగా తీవ్రమవుతుంది. ల్యాండ్‌ఫాల్ సమయంలో గాలి వేగం గంటకు 100-110 కిలోమీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని తేలిపింది. గంటకు 120 కి.మీ వరకు తుఫాను తీవ్రమైన తుఫానుగా మారుతుందని వెల్లడించింది.

సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరం అధికంగా ఉన్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని వాతావరణ శాఖ తెలిపింది. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.