నివార్ ఇలా తాకింది… ఎలా బీభత్సం సృష్టిస్తోంది… తుఫాన్ ప్రతాపం ఎంత..?

నివర్‌ తుఫాన్‌ తీరం దాటింది. రాత్రి 11.30కి మొదలైన ఈ ప్రక్రియ తెల్లవారుజామున రెండున్నర వరకు సాగింది. నివర్‌ తీరం దాటే సమయంలో పెను గాలులు వీచాయి. పుదుచ్చేరి, చెన్నై మధ్య తుఫాను కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.

నివార్ ఇలా తాకింది... ఎలా బీభత్సం సృష్టిస్తోంది... తుఫాన్ ప్రతాపం ఎంత..?
Follow us

|

Updated on: Nov 26, 2020 | 8:01 AM

నివర్‌ తుఫాన్‌ తీరం దాటింది. రాత్రి 11.30కి మొదలైన ఈ ప్రక్రియ తెల్లవారుజామున రెండున్నర వరకు సాగింది. నివర్‌ తీరం దాటే సమయంలో పెను గాలులు వీచాయి. పుదుచ్చేరి, చెన్నై మధ్య తుఫాను కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నివర్‌.. అతితీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా మారింది. మరో ఆరు గంటల్లో తుఫాన్‌గా మారనుంది నివర్.

నివర్‌ తాకిడికి తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం 50 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కేటాయించారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో 30 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. విజయవాడ, కటక్, త్రిస్సూర్‌లో మరో 20 బృందాలు సిద్దంగా ఉంచామని ఎన్టీఆర్‌ఎఫ్‌ తెలిపింది.

ఇక నివర్‌ ఎఫెక్ట్‌తో ఎక్కడికక్కడ చెట్లు, కరెంటు స్తంభాలు కూలుతున్నాయి. చెన్నైలోని ఐస్‌ హౌస్ దగ్గర గాలి తీవ్రతకు చెట్టు కూలి ఒకరు మృతిచెందారు. తరువల్లూరులో గోడ కూలి మరొకరు బలయ్యారు. కడలూరులో ఇళ్లు కూలి మహిళ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

నివర్ తుఫాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో భారీ ఈదురుగాలులలో కూడిన వర్షం కురిసింది. సత్యవేడులోని పలు మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. తుఫాన్ కారణంగా కడప జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోనూ విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు అధికారులు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..