ఉమ్‌పన్ ఎఫెక్ట్: ఏపీలో వెండి నాణేల వర్షం..

ఉమ్‌పన్ తుఫాన్ దాటికి తీరప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఏపీలో ఉమ్‌పన్ బలమైన ఈదురుగాలులతో బీభత్సం స్పష్టించింది. గాలివాన భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా, ఓ జిల్లాలో మాత్రం వెండి నాణేల వర్షం కురిసింది.

ఉమ్‌పన్ ఎఫెక్ట్: ఏపీలో వెండి నాణేల వర్షం..
Follow us

|

Updated on: May 23, 2020 | 6:09 PM

ఉమ్‌పన్ తుఫాన్ దాటికి తీరప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఏపీలో ఉమ్‌పన్ బలమైన ఈదురుగాలులతో బీభత్సం స్పష్టించింది. గాలివాన భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటుండగా, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం వెండి నాణేల వర్షం కురిసింది. జిల్లాలోని సముద్ర తీరం వెంట ఒక్కసారిగా వెండి నాణేలు కురిశాయి. దీంతో స్థానికులు ఓ వైపు ఆనందం, మరో ఆశ్చర్యంలో మునిగితేలారు. వివరాల్లోకి వెళితే… బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయి. దీంతో ఉప్పాడ కొత్తపల్లిలోని కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయి. సుమారు ఎనిమిది ఇళ్ల వరకు నేలమట్టమయ్యాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో ఓ కూలిపోయిన ఇంటి గోడల్లోంచి వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలు బ్రిటిష్ కాలం నాటివిగా భావిస్తున్నారు. అయితే, వీటి వెనుక స్థానికులు అనేక రకలైన కథలు చెబుతున్నారు. పూర్వం బొందు అమ్మోరయ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబానికి చెందినవారు ధనవంతులని, వారు ఇంటి గోడలలో ఈ వెండి నాణేలు దాచిపెట్టారేమో అనే పుకార్లు వినిపిస్తున్నాయి. వందల సంఖ్యలో వెండి నాణేలు స్థానికులకు దొరికినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం స్థానికులు గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం.. పురావస్తు శాఖవారికి తెలిస్తే..వారు వెండి నాణేలు సీజ్ చేస్తారనే భయంతో ఇళ్లల్లో దాచుకున్నట్లు సమాచారం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..