సైబర్ మిత్ర ఓ సూపర్ ఫ్రెండ్.. ఎలాగో తెల్సా..?

ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయాల వల్ల ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకునే అమ్మాయిల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే మహిళల దాకా ఎంతో మంది ఫేస్ బుక్‌కు అలవాటు పడి.. తెలియని వారితో ఛాటింగ్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి బయటపడింది. మాజీద్ అనే అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసుకుని.. ఓ కేటుగాడు ఏకంగా 200 మంది విద్యార్థులను వేధింపులకు గురిచేశాడు. చదువుకుంటున్న అమ్మాయిలే టార్గెట్‌గా […]

సైబర్ మిత్ర ఓ సూపర్ ఫ్రెండ్.. ఎలాగో తెల్సా..?
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 10:55 AM

ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయాల వల్ల ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చదువుకునే అమ్మాయిల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసే మహిళల దాకా ఎంతో మంది ఫేస్ బుక్‌కు అలవాటు పడి.. తెలియని వారితో ఛాటింగ్ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి బయటపడింది. మాజీద్ అనే అమ్మాయి పేరుతో ఫేస్ బుక్ ఐడీలు క్రియేట్ చేసుకుని.. ఓ కేటుగాడు ఏకంగా 200 మంది విద్యార్థులను వేధింపులకు గురిచేశాడు.

చదువుకుంటున్న అమ్మాయిలే టార్గెట్‌గా వారికి ఫ్రెండ్ రిక్వస్ట్‌లు పెడుతూ.. యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. వారిని నమ్మించి వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలుసుకుని వారిని వేధించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితం పదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయితో.. నీ సినియర్ అంటూ అదే స్కూల్లో చదువుకున్నాను అని చెప్పి ఫేస్ బుక్‌లో ఛాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మాయి వివరాలు తెలుసుకుని.. కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి చాటింగ్ చేయడం మానేసింది. ఇంకేముంది కోపంతో రగిలిపోయి.. “నీ ఫోటోలు అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పెడతానంటూ” బెదిరింపులకు పాల్పడ్డాడు. చేసేదేమి లేక వాడు అడిగిన డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టింది. కొన్నినెలల పాటు ఇలాగే మానసిక క్షోభను అనుభవించింది. తల్లిదండ్రులు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టింది. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అమ్మాయిలు ఇలాంటి మోసాలకు బాధితులు కాకుండా.. త్వరలోనే సైబర్ మిత్ర కార్యక్రమాన్నిచేపట్టబోతున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇక పై ప్రతి శనివారం సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో 3 గంటల పాటు.. పాఠశాలలు, కాలేజీల్లోని విద్యార్థులకు సైబర్ వేధింపులు, నేరాలు అనే అంశం పై బోధించబోతున్నామని చెప్పారు.

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!