ఎంపీ సంతోష్ పేరుతో డబ్బులు గుంజుతున్న బాలుడు అరెస్ట్

మరో నకిలీ ఫేష్ బుక్ కేటుగాడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి మోసాలకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు....

ఎంపీ సంతోష్ పేరుతో డబ్బులు గుంజుతున్న బాలుడు అరెస్ట్
Follow us

|

Updated on: Aug 27, 2020 | 6:37 PM

మరో నకిలీ ఫేష్ బుక్ కేటుగాడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను తెరిచి మోసాలకు పాల్పడుతున్న ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతడు చేసిన మోసాలపై ఆరా తీస్తున్నారు.

నకిలీ ఫేస్ బుక్ ఖాతాలో పలువురికి సందేశాలు పంపించినట్లుగా గుర్తించారు. తన ఖాతాలో ఉన్నటువంటివారిని డబ్బులు అడిగినట్లు ఆరోపణలున్నాయి. మాదాపూర్‌లో నివాసముండే ఓ యువకుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అతడిని మాటల్లో దింపి డబ్బులు అవసరముందంటూ మెసేజ్‌లతో పాటు కాల్స్ కూడా చేశాడు. ఒక ఎంపీ డబ్బులు అడగడం ఏమిటని అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్‌ ఫేస్‌ బుక్ ఐడీ ఆధారంగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి మోసాలు గతంలో ఏమైనా చేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులు చాలా మంది ఉంటారని హెచ్చరించారు సైబర్ క్రైం పోలీసులు. ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు వసూలు చేసే ముఠాలు నెట్టింట్లో చాలా ఉంటాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏమైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.