లాక్ డౌన్ వేళ.. పెరిగిన సైబర్ క్రైమ్.. ఆ సైట్లు చూసేవారే టార్గెట్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించారు. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పోర్న్‌సైట్లు చూసేవారు 95 శాతానికి పెరిగారట. దేశంలోని నెట్‌వర్క్ ఆపరేటర్లే ఈ విషయాన్ని

లాక్ డౌన్ వేళ.. పెరిగిన సైబర్ క్రైమ్.. ఆ సైట్లు చూసేవారే టార్గెట్..
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2020 | 5:21 PM

Cyber crime: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ ను మే 3వరకు పొడిగించారు. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పోర్న్‌సైట్లు చూసేవారు 95 శాతానికి పెరిగారట. దేశంలోని నెట్‌వర్క్ ఆపరేటర్లే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే ఇలా పోర్న్ సైట్లు చూసేవారే లక్ష్యంగా ఆన్‌లైన్ కేటుగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ సైట్లు చూసేవారిని బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి వేల డాలర్లను గుంజుతున్నారు. ఈ విషయాన్ని మహరాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు.

కాగా.. ఈ తరహా సైబర్ నేరాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయని, పోర్న్ సైట్లలో మాల్వేర్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా ఆయా సైట్లను వినియోగించే వారి కంప్యూటర్లలోకి, మొబైల్స్‌లోకి ప్రవేశించి విలువైన డేటాను చోరీ చేస్తారని తెలిపారు. అంతేకాకుండా వారి మాల్వేర్ మన సిస్టంలోకి ప్రవేశించినప్పటినుంచి మనం వినియోగిస్తున్న బ్రౌజర్ వారి ఆధీనంలోకి వెళుతుందని, దానిని రిమోట్‌లా వినియోగించి మన డేటాను, ఫోన్‌ నంబర్లను దొంగిలిస్తారని వివరించారు.

మరోవైపు.. ఆ తరువాత లాప్ టాప్, డెస్క్‌టాప్‌ల వెబ్ కామ్‌లు.. మొబైల్ ఫ్రంట్ కెమెరాల ద్వారా పోర్న్ సైట్లు చూస్తున్న వారి వీడియోలను చిత్రీకరిస్తారని, అనంతరం వారికి ఫోన్ చేసి బిట్‌కాయిన్లలో వేల డాలర్లు ఇవ్వాలని, లేకపోతే ఆ వీడియోలను ఆన్‌లైన్ షేర్ చేయడమే కాకుండా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారని పోలీసులు తెలిపారు. ఆ భయంతో అనేకమంది వారు అడిగినంత ఇవ్వడానికి సైతం సిద్ధపడతారని వివరించారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, పోర్న్ సైట్లను వినియోగించడం తగ్గించాలని హెచ్చరించారు.

Also Read: రూ.500కే కరోనా టెస్టింగ్ కిట్.. 15 నిమిషాల్లో ఫలితం..