పైకి వెడ్డింగ్ కార్డు.. లోపల డ్రగ్స్!

పెళ్లి కార్డుల్లో అక్రమంగా ఎఫెడ్రిన్‌ అనే మత్తు మందును తరలిస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు ఓ స్మగ్లర్‌. మొత్తం 43 పెళ్లి పత్రికల్లో.. 5.43కేజీల డ్రగ్స్‌ను రహస్యంగా ఉంచి కార్గో పార్సిస్‌ సర్వీస్‌ ద్వారా బెంగళూరు నుంచి ఆస్ట్రేలియా తరలించే..

పైకి వెడ్డింగ్ కార్డు.. లోపల డ్రగ్స్!
Follow us

| Edited By:

Updated on: Feb 23, 2020 | 5:15 PM

పెళ్లి కార్డుల్లో అక్రమంగా ఎఫెడ్రిన్‌ అనే మత్తు మందును తరలిస్తూ.. అడ్డంగా బుక్కయ్యాడు ఓ స్మగ్లర్‌. మొత్తం 43 పెళ్లి పత్రికల్లో.. 5.43కేజీల డ్రగ్స్‌ను రహస్యంగా ఉంచి కార్గో పార్సిస్‌ సర్వీస్‌ ద్వారా బెంగళూరు నుంచి ఆస్ట్రేలియా తరలించే ప్రయత్నం చేశాడు. పెళ్లి కార్డ్స్‌పై అనుమానం వచ్చిన బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్‌ అధికారులు.. వాటిని తీసి చూసే ప్రయత్నం చేశారు. ఎవరికి అనుమానం రాకుండా.. పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్‌ ప్యాకెట్లను చూసి షాక్‌ అయ్యారు అధికారులు. అయితే ఈ డ్రగ్స్‌ను మధురైకి చెందిన ఓ వ్యక్తి తరలిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ఇదే కార్గో విభాగంలో ఈ నెల 18న బట్టలు కుట్టే యంత్రంలో 5 కోట్ల ఖరీదైన ఎఫెడ్రిన్‌ను రవాణా చేస్తుండగా కస్టమ్స్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడడం కలవరపరుస్తోంది. దీంతో కస్టమ్స్‌ అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరచుగా డ్రగ్స్‌ రవాణా కేసులు బయటపడడం చూస్తుంటే మత్తు రవాణాకు దుండగులు బెంగళూరు ఎయిర్‌పోర్టును ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. చెన్నై, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో తనిఖీలను ముమ్మరం చేయడంతో ఇక్కడి నుంచి స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?