Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 936181 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 319840 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 592032 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24309 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా వ్యాక్సిన్ పై నిమ్స్ లో ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్. నిన్న ఆరుగురి నుండి రక్త నమూనాలు సేకరించి ఢిల్లీ ఐసీఎమ్ఆర్కు పంపిన నిమ్స్ వైద్యులు. రెండు రోజుల్లో నిమ్స్ కు రానున్న రిపోర్ట్స్. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వారిపై కు వ్యాక్సిన్ మొదటి డోసు ప్రయోగించనున్న వైద్యులు. నిమ్స్ లో రెండు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణ. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ ప్రయోగం.
  • అమరావతి: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ సమావేశం . రాష్ట్రం లో కొత్త జిల్లాల ఏర్పాటు కు కమిటీ నియామకానికి ఆమోదం తెలిపే అవకాశం . సిపిఎస్ విధానం పై పోరాటం లో ఉద్యోగుల పై పెట్టిన కేసులు ఉపసంహరణ పై నిర్ణయం తీసుకునే అవకాశం. వైఎస్సార్ చేయూత పథకానికి ఆమోదం తెలిపే ఛాన్స్. ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుపై చర్చించే అవకాశం. మరిన్ని కీలక అంశాలపై క్యాబినెట్ లో చర్చించే అవకాశం.
  • TSRTC ఈడీ అడ్మిన్ గా పని చేస్తున్నా వెంకటేశ్వరరావు మృతి చెందారు. ఈరోజు ఉదయం గుండె పోటు రావడం తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. RTC విశేష సేవలందించిన టీవీ రావు మరణము పట్ల TSRTC తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
  • ఐసోలేషన్ సెంటర్లుగా ఫంక్షన్ హాళ్లు. Ghmcలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆలోచనలు . గ్రేటర్ లో 1500 బస్తీల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. బస్తీల్లో నివసిస్తున్న దాదాపు 20లక్షల జనాభా . ఇంటిలోనే వైద్యానికి వీలు పడని వారి సౌకర్యం కోసం ఆలోచన. హోమ్ ఐసోలేషన్ లో వుండి చికిత్స తీసుకునే అవకాశం లేని వారి కోసం ప్రత్యామ్నాయం.
  • తెలంగాణలో మళ్లీ మావోల అలజడి. అధికార పార్టీ ఎమ్మెల్యేల టార్గెట్‌ చేస్తూ మావోల యాక్షన్‌ ఫ్లాన్‌. ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంపు. ఏజెన్సీ ప్రాంతాలలో ముందస్తు సమాచారం లేకుండా పర్యటించొద్దని ప్రజాప్రతినిధులకు పోలీసుల సూచన.
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సినిమా షూటింగ్ కోసం అనుమతి ఇచ్చినా ఇది సరైన సమయం కాదు, కారోనా ఇంత ఎక్కువగా ఉన్న టైంలో సినిమా షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు. మోహన్ వడ్లపట్ల, సెక్రటరీ, నిర్మాతల మండలి.

థియేటర్లలోకి బయటి స్నాక్స్ ఓకే..కానీ,..

Customers Cannot Be Restricted From Carrying Own Food To Movie Theaters: Hyderabad Police In RTI Reply, థియేటర్లలోకి బయటి స్నాక్స్ ఓకే..కానీ,..

సినిమాకు వెళ్లి మూడు గంటలపాటు కూర్చోవాలి. అయితే, సినిమా నడుస్తున్నాంత సేపు ఏదన్నా తింటూ సినిమా చూస్తే బాగున్ను అనిపిస్తుంది..బయట కొనుక్కున్నవి థియేటర్లోకి అనుమతించారు..థియేటర్లో కొనుక్కుందామంటే జేబుకి చిల్లు గ్యారెంటీ..కానీ, ఇప్పుడు వినియోగదారులకు ఊరట కలిగించే వార్త ఒకటి వెల్లడైంది..‘‘సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలోకి స్నాక్స్‌, వాటర్‌ బాటిళ్లు అనుమతించాల్సిందేనని, ప్రేక్షకుల కోసం స్వచ్ఛమైన తాగునీరూ ఉచితంగా అందుబాటులో ఉంచాల్సిందే’’నంటూ  హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త నమోదు చేసిన దరఖాస్తుకు సమాధానంగా పోలీసు శాఖ బదులిచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆహార పదార్థాలు, టిఫిన్‌ బాక్సులను థియేటర్లు అనుమతించడం లేదని పేర్కొంది. అయితే వాటర్‌ బాటిళ్లను తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. సినిమా హాల్‌ లోపల స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత థియేటర్లపై ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించే థియేటర్లపై లీగల్‌ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. అధికారుల తాజా ప్రకటనతో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లాలనుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక గుడ్‌న్యూసే అంటున్నారు సినీ ప్రేక్షకులు.

Related Tags