సీఎస్‌కే ఖాతాలో అత్యంత చెత్త రికార్డు..

నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 

  • Ravi Kiran
  • Publish Date - 5:55 pm, Sat, 24 October 20
CSK Worst Record

CSK Worst Record: ఐపీఎల్ చరిత్రలో ఛాంపియన్ జట్టు.. ప్రతీసారి ప్లేఆఫ్స్‌కు చేరింది.. ఎనిమిది సార్లు ఫైనల్స్.. మూడుసార్లు టైటిల్ గెలిచింది.. ఇంతటి ఘనమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది లీగ్‌ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రతీ మ్యాచ్‌లోనూ టెస్ట్ తరహా బ్యాటింగ్ పేలవ ఆటతీరుతో ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తూ వచ్చింది.

ఇక నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. పవర్‌ప్లే ముగిసేలోగా ఐదు వికెట్లు కోల్పోయిన మూడో జట్టుగా నిలిచి చెత్త రికార్డు క్లబ్‌లోకి చేరిపోయింది. 24/5 రన్స్‌తో చెత్త రికార్డు క్లబ్‌లో మూడో స్థానంలో ఉంది. ఈ క్లబ్‌లో తొలి స్థానంలో ఆర్సీబీ 62-7(2019) ఉండగా.. కోచి టస్కర్స్ కేరళ 29-6(2011) రెండో స్థానంలో నిలిచింది.

Also Read: మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..