Breaking News
  • హైదరాబాదులో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించారు. వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సియం ఆదేశించారు. సియం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుండి మూడు,పర్యాటక శాఖ ద్వారా ఐదు మొత్తం 8స్పీడు బోటులను వెంటనే హైదరాబాదు పంపిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. అంతేగాక ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన ఈతగాళ్లను (డ్రైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను పంపుతున్నట్లు తెలియజేశారు.
  • టీవీ9 తో తెలంగాణ విద్యుత్ సీఎండీ రఘురామ రెడ్డి: Ghmc వర్షాల వల్ల విద్యుత్ కి తీవ్ర అంతరాయం కలిగింది. జీహెచ్ఎం సి పరిధిలో కోటి రూపాల నష్టం జరిగింది. జిల్లాలో 2 కోట్ల నష్టం జరిగింది. వర్షం దాటికి ట్రాన్స్ఫార్మర్స్ కొట్టుకొని పోయాయి ,కొన్ని ప్రాంతాల్లో నీట మునిగాయి. హైదరాబాద్ కి సౌత్ సైడ్ ఎక్కువ డ్యామేజి అయింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు ఉండీ పోయి విద్యుత్ పునరుద్ధరణ కి కష్టం అవుతుంది. సిటీ లో 456 సబ్ స్టేషన్స్ ఉన్నాయి 15 నీట మునిగాయి. కొన్ని స్టేషన్స్ వాటర్ తొడించి పునరుద్ధరణ జరిపము. నీటి ప్రవాహం వల్ల 1767 ట్రాన్ఫోఫార్మర్స్ ని బంద్ చేయడం జరిగింది. సరూర్ నగర్ ఏరియా కాలనీలో ,ఓల్డ్ సిటీ కింసంబంధించిన కాలనిలలో ఇంకా కొన్ని ప్రాంతాలు పవర్ లేకుండా ఉన్నాయి. Ghmc పరిధిలో 51 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అందులో 30 వేల వరకు అంతరాయం కలిగింది. ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ వొస్తున్నాం.
  • అమరావతి : 56 బిసి కార్పొరేషన్ లకు సంబంధించి డైరెక్టర్ ల జాబితా విడుదల . ఒక్కో కార్పొరేషన్ కు 12 మంది పేర్లు ఖరారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం, రాజమండ్రి కంబాల చెరువు, లాల చెరువు, కడియం, రావులపాలెం, రంపచోడవరం, కోనసీమ, మన్యం ప్రాంతాల్లో భారీ వర్షం, కిర్లంపూడిలో భవనంపై పిడుగు, చుట్టుపక్కల ఇళ్లలో కాలిపోయిన ఎలక్ర్టికల్ పరికరాలు
  • నా భర్త నాగరాజు మృతిపై అనేక అనుమానాలున్నాయి. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మూడు నెలల్లో బయటకు వస్తానని నాకు చెప్పాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై విచారణ జరపాలి. - మాజీ కీసర తహశీల్దార్ నాగరాజు భార్య స్వప్న . నాగరాజు ఉన్న బ్యారెక్‌లో మరో నలుగురు ఉన్నారు. వాళ్లపైన కూడా నాకు అనుమానం ఉంది- నాగరాజు భార్య స్వప్న . టవల్‌తో సూసైడ్ చేసుకున్నాడని జైలు అధికారులు ఎలా చెబుతారు. ప్రభుత్వం నాగరాజు మృతిపై విచారణ జరిపించాలి. మా కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలి. హెచ్చార్సిలో ఫిర్యాదు చేసిన నాగరాజు భార్య స్వప్న.
  • హైదరాబాద్: వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం- సీఎం కేసీఆర్.
  • హైదరాబాద్: దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడుపనున్న టీఎస్ ఆర్టీసీ. ఈ నెల 24 వరకు 3వేల ప్రత్యేక బస్సులు- రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ . హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలు, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు బస్సులు . ఎంజీబీఎస్‌, జేబీఎస్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎస్సార్‌నగర్,అమీర్‌పేట. ఈసీఐఎల్‌, ఉప్పల్ క్రాస్‌రోడ్డు, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సులు . పండుగ నేపథ్యంలో అడ్వాన్స్‌ బుకింగ్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాం. - రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ .

చెన్నై మెరిసింది… సజీవంగా ప్లేఆఫ్‌ ఆశలు

అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది.

Chennai Super Kings win, చెన్నై మెరిసింది… సజీవంగా ప్లేఆఫ్‌ ఆశలు

Chennai Super Kings Win : అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌పై గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్ల దాడికి హైదరాబాద్ జట్టు చిగురుటాకులా వణికిపోయింది.

దుబాయ్‌ వేదికగా వార్నర్‌ సేనతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. విలియమ్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. లక్ష్య ఛేదనలో చెన్నై బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది.

దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కేన్‌ విలియమ్సన్‌ (57: 39 బంతుల్లో 7ఫోర్లు) అద్భుత అర్ధశతకం పోరాటం వృథా అయింది.కేన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో(2/25), కర్ణ్‌ శర్మ(2/37) సన్‌రైజర్స్‌ను దెబ్బతీశారు.

చేజింగ్‌లో సన్‌రైజర్స్‌కు శుభారంభం లభించలేదు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. శామ్‌ కరన్‌ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్(9)‌, మనీశ్‌ పాండే(4) వెనుదిరిగారు. 27 పరుగులకే సన్‌రైజర్స్‌ 2 వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలో పడింది.

ఈ దశలో క్రీజులో ఉన్న విలియమ్సన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. అయితే విలియమ్సన్‌, బెయిర్‌స్టో క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేయగా ఈ జోడీని జడేజా విడదీశాడు. జడ్డూ వేసిన 10వ ఓవర్లో బెయిర్‌స్టో బౌల్డ్‌ అయ్యాడు.

మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ సహకారం అందిచకపోయినా కేన్‌ ఒక్కడే ఆఖరి పోరాటం చేశాడు . 36 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కర్ణ్‌ శర్మ వేసిన తర్వాతి ఓవర్‌ మొదటి బంతికి ఫోర్‌ కొట్టిన విలియమ్సన్‌.. తర్వాతి బంతికే ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివరి ఓవర్లలో రషీద్‌ ఖాన్‌(14), షాబాజ్‌ నదీమ్‌(5) పోరాడిన గెలుపు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు.

Related Tags