IPL 2020 : CSK vs RR : చెన్నైపై రాజస్థాన్ ఘనవిజయం

ఐపీఎల్‌-2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌ కీలక సమయంలో సత్తా చాటింది. ప్లేఆఫ్స్‌ రేస్‌లో నిలవాల్సిన సమయంలో బిగ్ ఫైట్ చేసింది. 

IPL 2020 :  CSK vs RR : చెన్నైపై రాజస్థాన్ ఘనవిజయం
Follow us

|

Updated on: Oct 19, 2020 | 11:21 PM

ఐపీఎల్‌-2020లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌ కీలక సమయంలో సత్తా చాటింది. ప్లేఆఫ్స్‌ రేస్‌లో నిలవాల్సిన సమయంలో బిగ్ ఫైట్ చేసింది.  జోస్‌ బట్లర్‌(70 నాటౌట్‌: 48 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అద్బుత ఆటతీరుతో హాఫ్ సెంచరీ చేయడంతో అలవోకగా చెన్నైపై విజయాన్ని  అందుకుంది. ఏకంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌పై రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆరంభంలో రాజస్థాన్‌ను కట్టడి చేసిన చెన్నై బౌలర్లు బట్లర్‌ను ఏ దశలోనూ నిలువరించలేకపోయారు‌. దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు తీయగా, హేజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీశాడు.

126 పరుగుల ఛేదన కోసం బరిలో దిగిన రాజస్థాన్‌ జట్టులో బట్లర్‌కు తోడు స్టీవ్‌ స్మిత్‌(26 నాటౌట్‌: 34 బంతుల్లో 2ఫోర్లు) మంచి ప్రదర్శన చేశాడు. దీంతో 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో తేలిపోయిన చెన్నై మరో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ జడేజా(35: 30 బంతుల్లో 4 ఫోర్లు), కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(28: 28 బంతుల్లో 2ఫోర్లు) రాణించడంతో ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ అయినా చేయగలిగింది.  రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌(1/20), కార్తీక్‌ త్యాగీ(1/35), శ్రేయాస్‌ గోపాల్‌(1/14), రాహుల్‌ తెవాటియా(1/18) తలో వికెట్‌ పడగొట్టారు.

USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం