Breaking News
  • అమరావతి : మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా . ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రి కి చేరుకున్న సీఎం జగన్. ఘాట్ రోడ్ మార్గంలో వచ్చిన సీఎం . సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,జిల్లా ప్రజా ప్రతినిధులు ,కలెక్టర్ ,సిపి [ సాంప్రదాయ వస్త్ర ధారణ పంచెకట్టు లో సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • చిత్తూరు: చిత్తూరులో భారీ ఎత్తునపట్టుబడిన ఎర్రచందనం. ఐదు కార్లలో రెండు కోట్ల విలువైన రెండున్నర టన్నుల ఎర్రచందనం పట్టి వేత. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం. 11మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో పదిమంది స్మగ్లర్ల పరారీ.. కార్లు, ఆటోలు, పాల వానలు లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి.

CSK vs DC: చెన్నై,డిల్లీ మధ్య సూపర్ ఫైట్.. వీరే కీలకం

తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో పోరుకు సిద్ధమైంది. సెకండ్‌ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే చెన్నై ఈ సీజన్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో ముంబైతో గెలిచి..

CSK vs DC Team Predicted, CSK vs DC: చెన్నై,డిల్లీ మధ్య సూపర్ ఫైట్.. వీరే కీలకం

తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో పోరుకు సిద్ధమైంది. సెకండ్‌ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే చెన్నై ఈ సీజన్‌ ఫస్ట్‌ మ్యాచ్‌లో ముంబైతో గెలిచి.. రెండో మ్యాచ్‌లో 217 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక రాజస్థాన్‌ చేతిలో ఓటమిపాలైంది. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న ఢిల్లీ, వీటిల్లో ఎంతో అనుభవం ఉన్న చెన్నై నుంచి సవాల్‌ ఎదురుకానుంది.

రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్ చేతిలో చెన్నై ఓడినప్పటికీ.. కొన్ని సానుకూలతలు కనిపించాయి. తొలి మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్‌.. సెకండ్‌ మ్యాచ్‌లో చెలరేగడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు వాట్సన్‌ కూడా ఫామ్‌లోకి వచ్చాడు.

ముంబై మ్యాచ్‌లో గాయపడ్డ అంబటి రాయుడు.. ఢిల్లీతో మ్యాచ్‌లో అందుబాటులో ఉండడని ఇప్పటికే సీఎస్‌కే  ప్రకటించింది. దీంతో మళ్లీ రుతురాజ్‌కే అవకాశం దక్కనుంది. ధోని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ దిగడంపై అభిమానులు, సీనియర్ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు తప్పవని భావిస్తున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై జడేజా సహా ఐదుగురు బౌలర్లనే వాడటం మంచి వ్యూహం అని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి మ్యాచ్‌లో మంచి ఆరంభం దక్కలేదు. స్టోనియిస్‌ తప్పా మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేదు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, పంత్, శిఖర్ ధవన్‌ ఫామ్‌లోకి వస్తేనే చెన్నైకి గట్టి పోటీనివ్వగలదు. ఇక బౌలింగ్ విభాగాన్ని చూస్తే అశ్విన్‌కు గాయం కావడం కలవరపెడుతోంది. అశ్విన్‌ అందుబాటులోకి రాకపోతే చెన్నైని కట్టడి చేయడం అంత సులువు కాదని అంచనా.

Related Tags