Crypto Currency In India : పడిపోతున్న క్రిప్టోకరెన్సీల ధరలు… బడ్జెట్‌ భయం పట్టుకుందా…

క్రిప్టోకరెన్సీల ధరలు పడిపోతున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో వాటి ధరలు అమాంతం కిందకు  దిగుతున్నాయి...

Crypto Currency In India : పడిపోతున్న క్రిప్టోకరెన్సీల ధరలు... బడ్జెట్‌ భయం పట్టుకుందా...
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2021 | 10:57 AM

క్రిప్టోకరెన్సీల ధరలు పడిపోతున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో వాటి ధరలు అమాంతం కిందకు  దిగుతున్నాయి. దీనికి కారణం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ప్రైవేట్ క్రిప్టో కరెన్నీలను నిషేధించే బిల్లును పరిశీలిస్తుందనే వాదనే.

రెగ్యులేషన్  రాబోతోందా…?

ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ సెషన్స్‌లోనే ‘ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు, 2021’ను ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆర్బీఐ ఆధ్వర్యంలో సెంట్రల్ డిజిటల్ కరెన్సీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలు కలుగుతుందని వజీర్ ఎక్స్ వ్యవస్థాపకుడు శెట్టి తెలిపాడు.

దేశంలో ఉన్న క్రిప్టో కరెన్సీలు కొన్ని…

భారతదేశంలో క్రిప్టో కరెన్సీలు చాలానే ఉన్నాయి. వాటిలో బిట్‌కాయిన్, ఎక్స్ఆర్పీ, యూఎస్డీటీ, ఈటీహెచ్, టీఆర్ఎక్స్, యూఎన్ఐ, ఇంకా ఎన్నో క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. పలు స్టార్టప్ కంపెనీలు సైతం క్రిప్టో కరెన్సీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి.

ధరలు పడిపోతున్నాయి…

బడ్జెట్ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీల ధరలు అమాంతం పడిపోతున్నాయి. రికార్డు ధరలు సాధించిన డిజిటల్ కరెన్సీలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. బిట్‌కాయిన్ ధర జనవరి 31న ఏడు శాతం పతనానికి గురైంది. యూఎస్డీటీ ధర సైతం ఆరు శాతం పడిపోయింది. అన్నింటి కంటే డాగీకాయిన్ ధర దాదాపు 18 శాతం కిందకు దిగింది. కాగా ఒకటి, రెండు క్రిప్టో కరెన్సీల విలువలు పెరిగాయి.

బడ్జెట్ లైవ్ దిగువన చూడండి:

Also Read : Silver Cost Today(01-02-2021): బంగారం బాటలోనే పరుగులు పెడుతున్న వెండి.. కిలోకి ఏకంగా రూ.1,200 పెరిగి..