Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • మోడీ నాయకత్వంలో కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. పేద ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారిని పరిరక్షించుకుంటూనే, 5 ట్రిలియల్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. గరీబ్ కళ్యాణ్ యోజన, గరీబ్ అన్న యోజన, గరీబ్ రోజ్ గార్ యోజన వంటి చర్యలు తీసుకొచ్చాము. వన్ నేషన్- వన్ మార్కెట్ , వన్ నేషన్- వన్ రేషన్ కార్డు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ సరిహద్దులను కాపాడుకుంటూనే, దేశంలోని సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది. కరోనా ను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశలో రాష్ట్రం పని చేయడం లేదు ప్రభుత్వ తీరుపై బిజేపి ముందు నుంచి పోరాడుతుంది కరోనా మహమ్మారిపై కేంద్ర ముందు నుంచి హెచ్చరిస్తోంది కానీ తెలంగాణా ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం పాటించాలి. ఐసిఎంఆర్ నిర్ణయాలను పొగడడమే కాదు, అమలు కూడా చేయాలి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ సమర్ధవంతంగా చేయాలన్నదే మా డిమాండ్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి అందిన విరళల దర్యాప్తుకు అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ. మనిలాండరింగ్, ఐటి, తదితర చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయనున్న కమిటీ. ఈడీ ప్రత్యేక డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ తన కార్యకలాపాలు నిర్వహించనుంది. మురళీధర్ రావు, బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి.
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లోని గవర్నర్ భవన్ లో కరోనా కలకలం . గవర్నర్ బంగ్లా లో పనిచేసే సిబ్బంది ఒకరికి కరోనా నిర్ధారణ . గవర్నర్ కిరణ్ బేడీ తో సహా సిబ్బందికి కరోనా పరీక్షలు చేసిన వైద్యులు ,సిబ్బందిని ఖ్వారంటైన్ చేసి ,గవర్నర్ భవన్ ని సానిటీజెషన్ చేస్తున్న అధికారులు . రెండురోజుల పాటు గవర్నర్ భవన్ ని మూసివేస్తునట్టు ,గవర్నర్ కిరణ్ బేడీ ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించిన అధికారులు.
  • చెన్నై : అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత రాష్ట్ర మంత్రి తంగమనికి కరోనా నిర్ధారణ . మంత్రి తో పాటు మంత్రి కుమారుడికి కరోనా నిర్ధారణ ,చెన్నై అపోలో ఆస్పత్రి లో చికిత్స అందిస్తున్న వైద్యులు . తమిళనాడు లో ఇప్పటివరకు డీఎంకే , అన్నాడిఎంకె పార్టీలలో ఇద్దరు మంత్రులతో సహా 10 మంది ఎమ్మెల్యే లకు కరోనా నిర్ధారణ ,
  • నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ . నిమ్మగడ్డ రమేష్ పునర్ నియామకాన్ని సవాలు చేసిన ఏపీ ప్రభుత్వం. మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. ఎన్నికల నిర్వహణపై మాట్లాడుదలచుకోలేదన్న సీజేఐ ఎస్ఏ బొబ్డే. హైకోర్టు ఆదేశాలతో గతంలోని అధికారులు కూడా విధులు నిర్వర్తించలేకపోతున్నారన్న ఏపీ న్యాయవాది రాకేష్ ద్వివేది. మధ్యంతరంగా ఎస్ఈసీని నియమించేలా గవర్నర్ కు సూచించాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది. ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సూచనను తిరస్కరించిన సీజేఐ. గవర్నరకు ఇప్పుడు సూచన చేయలేమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 3 వారాల తర్వాత తుది వాదనలు వింటామన్న సీజేఐ ఎస్ ఏ బొబ్డే. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా.

నెగ్గించే బాధ్యత ‘ఆ’ నలుగురిదే.. టార్గెట్ నిర్దేశించిన అమిత్‌షా?

crucial responsibility for four leaders, నెగ్గించే బాధ్యత ‘ఆ’ నలుగురిదే.. టార్గెట్ నిర్దేశించిన అమిత్‌షా?

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్న బిజెపి హార్స్ ట్రేడింగ్‌ బాధ్యతలను వికేంద్రీకరించింది. శనివారం ఆగమేఘాల మీద, అర్ధరాత్రి మంతనాలతో పొద్దుపొద్దున్నే పదవీ ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌లకు ఇదివరకే తమ తమ లక్ష్యాలను నిర్దేశించిన బిజెపి అధిష్టానం.. తాజాగా మరో నలుగురికి కీలక బాధ్యతలప్పగించినట్లు సమాచారం. కావాల్సిన 145 మంది శాసనసభ్యులే కాకుండా 170-180 వరకు బలపరీక్షలో దేవేంద్రుని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసేటట్టు చూడాలని ఆ నలుగురు నేతలకు అమిత్‌షా గట్టిగానే చెప్పారని ముంబయి మీడియా కథనాలిస్తోంది.

అక్టోబర్ 24న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పట్నించి.. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మహా రాజకీయ పరిణామాలు శనివారం అనూహ్యంగా కొత్త టర్న్ తీసుకున్నాయి. తెల్లారితే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని, శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని అందరు భావించారు. శనివారం అన్ని మీడియాల్లో బ్యానర్ ఐటమ్స్, హెడింగ్స్ అవే దర్శనమిచ్చాయి. కానీ అనూహ్యంగా అర్ధరాత్రి పరిణామాలతో తెల్లరగానే బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ పదవీ ప్రమాణం చేశారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వర్గాలే కాదు.. యావత్ దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇటు బిజెపి కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతోపాటు ప్రత్యర్థుల క్యాంపుల్లో వున్న వారికి తాయిలాలు ఆశచూపడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో గోవా క్యాంపునకు చాలా మంది ఎమ్మెల్యేలను తరలించారు కమలనాథులు. అయితే.. 105 మంది సభ్యులున్న బిజెపి బల పరీక్షలో నెగ్గాలంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను అదనంగా తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి వుంది. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఈజీగా వస్తారని ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సీఎంతో జరిగిన భేటీలో అజిత్ పవార్ ఈ మేరకు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్సీపీ తరపున గెలిచిన వారిలో సుమారు 36 మందికి.. తాను ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు అరేంజ్ చేసానని అజిత్ పవార్ క్లెయిమ్ చేసుకుంటున్నారు.

మరోవైపు దేవేంద్ర సర్కార్‌కు ఇప్పటికే 15 మంది ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. వారిలో 11 మంది ఎమ్మెల్యేలు ఆల్‌రెడీ తమ సంతకాలతో కూడిన మద్దతు లేఖలను సీఎం చేతికిచ్చినట్లు చెబుతున్నారు. 15 మందికి అదనంగా మరో 10 మంది ఇండిపెండెంట్లకు గాలమేసేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శివసేనకు ఇదివరకే మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్లకు భారీగా తాయిలాలను ఆశచూపుతున్నట్లు సమాచారం. బిజెపి 105, అజిత్ వర్గం 30కి తోడుగా.. ఇండిపెండెంట్లు 20 వరకు వస్తే.. బల పరీక్షలో నెగ్గడం బిజెపికి సులువు అవుతుంది. కానీ.. 145 సంఖ్య టార్గెట్‌గా పనిచేయొద్దంటూ భారీ లక్ష్యాన్ని అమిత్‌షా నిర్దేశించినట్లు చెబుతున్నారు.

145 మేజిక్ ఫిగర్‌ కాగా.. 170 నుంచి 180 వరకు ఎమ్మెల్యేల మద్దతు సంపాదించాలని అమిత్‌షా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి వచ్చి బిజెపిలో చేరిన సీనియర్ నేతలకు అమిత్‌షా బాధ్యతలప్పగించినట్లు ముంబయి మీడియా రాస్తోంది. నారాయణ్ రాణే, గణేశ్ నాయక్, బాబన్ రావు లోనికర్, ఆర్కే విఖే పాటిల్‌లకు బాధ్యతలప్పగించిన అమిత్‌షా… కాంగ్రెస్, ఎన్సీపీలను చీల్చే బాధ్యతలను ఆదేశించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో శివసేనను చీల్చే బాధ్యతలను దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు విదర్భ ప్రాంతానికి చెందిన సంఘ పరివార్ కీలక నేతలను దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దింపినట్లు సమాచారం. సో.. మొత్తమ్మీద సుప్రీం కోర్టు మంగళవారం ఇవ్వనున్న తీర్పులోగానే పరిస్థితిని చక్కదిద్దుకోవాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది.

Related Tags