సీఎస్ బదిలీ వెనుక కథ.. వింటే యమా ఇంటరెస్టింగ్ గురూ !

దూరంగా వున్నప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం అదుర్స్..అప్పటి సీఎం టార్గెట్ చేసినందుకు ఈయనకు దగ్గరయ్యారు. ఈయన సీఎం అయ్యాక మరింత సన్నిహితంగా మారాల్సింది పోయి.. అవమానకరంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానం నుంచి బదిలీవేటుకు గురయ్యారు. ఈపాటికి మీకు సీన్.. కాదు మొత్తం సినిమా కథ అర్థమైపోయి వుంటుంది. కొన్ని ప్రత్యేక పరిణామాల్లో చీఫ్ సెక్రెటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో అంటీముట్టనట్లున్న ఆనాటి వైఖరి ఎన్నికలయ్యాక ప్రభుత్వం మారి ముఖ్యమంత్రిగా వైఎస్ […]

సీఎస్ బదిలీ వెనుక కథ.. వింటే యమా ఇంటరెస్టింగ్ గురూ !
Follow us

|

Updated on: Nov 04, 2019 | 5:12 PM

దూరంగా వున్నప్పుడు వారిద్దరి మధ్య సాన్నిహిత్యం అదుర్స్..అప్పటి సీఎం టార్గెట్ చేసినందుకు ఈయనకు దగ్గరయ్యారు. ఈయన సీఎం అయ్యాక మరింత సన్నిహితంగా మారాల్సింది పోయి.. అవమానకరంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానం నుంచి బదిలీవేటుకు గురయ్యారు. ఈపాటికి మీకు సీన్.. కాదు మొత్తం సినిమా కథ అర్థమైపోయి వుంటుంది.
కొన్ని ప్రత్యేక పరిణామాల్లో చీఫ్ సెక్రెటరీగా ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో అంటీముట్టనట్లున్న ఆనాటి వైఖరి ఎన్నికలయ్యాక ప్రభుత్వం మారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఎల్వీ కీలకంగా మారడం అలా అలా కమ్ అండ్ గో లాగా జరిగిపోయాయి. గతంలో వున్న పరిచయాలు.. ఒకరి వల్ల ఇంకొకరు పడిన ఇబ్బందులు జగన్.. చీఫ్ సెక్రెటరీ (తాజా మాజీ) ఎల్వీ సుబ్రణ్యంల మధ్య మాంచి సంబంధాలున్నాయన్న వార్తలకు తావిచ్చాయి.
కానీ, పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా వుండవు కదా.. సీన్ ఒక్కసారిగా రివర్స్ అయ్యింది. అందుకే చాలా స్మూత్‌గా కాకపోతే చాలా గట్టి నిర్ణయంతో చీఫ్ సెక్రెటరీ పోస్టు నుంచి ఎల్వీని కూల్‌గా తప్పించేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీనికి బీజం గత వారం స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే పడినట్లు విశ్వసనీయ సమాచారం.
వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా కలెక్టర్లు, కార్యదర్శులతో మాట్లాడిన ఎల్వీ.. చెత్త డంపింగ్ యార్డుల కోసం భూములను ఎంపిక చేయడమే మొదటి ప్రాధాన్యతగా చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ళ స్థలాలు కేటాయించిన తర్వాత చెత్త డంపింగ్ యార్డులకు జాగా దొరకదన్నది ఎల్వీ అభిప్రాయం. ఈ తీరు నచ్చని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ మధ్యలోనే మైక్ అందుకుని.. ‘‘ ఇళ్ళ స్థలాలను గుర్తించడమే మొదటి ప్రాధాన్యత ’’ అన్న ఒకే ఒక్క మాటతో అధికారుతోపాటు ఎల్వీకి షాకిచ్చినట్లు సమాచారం.
ఆ తర్వాత ఓ సహాయ కార్యదర్శి స్థాయి అధికారిని సచివాలయంలోని ఒక విభాగం నుంచి మరో విభాగానికి బదిలీ  చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోకపోవడం, సంబంధిత ఫైలును కూడా పెండింగ్‌లో పెట్టేయడం కూడా సీఎస్‌కు.. సీఎంకు మధ్య అఘాధం పెంచేసినట్లు విశ్వసనీయ సమాచారం
సీఎం ఆదేశాలు పట్టించుకోకపోవడం, ఇళ్ళ స్థలాల ఎంపికపై సీఎం అభిమతానికి భిన్నంగా మాట్లాడడమే ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయి అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌ ఓ జివోను జారీ చేయడం ఎల్వీకి ఇబ్బంది కలిగించింది. దానిపై వెంటనే ప్రవీణ్ ప్రకాశ్‌కు శనివారం నాడు షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఎల్వీ. ఈ చర్య ముఖ్యమంత్రిలో మరింత ఆగ్రహాన్ని పెంచేసినట్లు సమాచారం.
దానికి తోడు ప్రభుత్వంలో జరుగుతున్న ఇంటర్నల్ మేటర్స్ ఓ సెలెక్టివ్ మీడియా సంస్థలకు ఎల్వీ చేరవేస్తున్నట్లు సీఎంకు ఇంటెలిజెన్స్ సమాచారం అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ కారణాలు.. ఎల్వీ చర్యలతో విసిగిపోయిన ముఖ్యమంత్రి అత్యంత పక్కాగా.. ఫర్మ్‌గా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇంకా 5 నెలల 26 రోజుల పదవీ కాలం వున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ పదవి నుంచి తప్పిస్తూ.. ఎపీ హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్సిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. విశేషమేమిటంటే.. తాను షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రవీణ్ ప్రకాశ్ చేతనే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ ఉత్తర్వులను జారీ చేయించారు ముఖ్యమంత్రి జగన్. తదుపరి చీఫ్ సెక్రెటరీగా సమీర్ శర్మ, నీలం సహానీల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!