రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలేది నేడే?

టిఎస్‌ఆర్‌టిసికి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు, టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని విలువైన ఆస్తులను ఆర్టీసీ ఇప్పటికే వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన తరువాత, హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో యాజమాన్యం ఆస్తులపై […]

రాష్ట్ర కేబినెట్ సమావేశం.. ఆర్టీసీ కార్మికుల భవితవ్యం తేలేది నేడే?
Follow us

| Edited By:

Updated on: Nov 28, 2019 | 5:06 AM

టిఎస్‌ఆర్‌టిసికి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించడంతో పాటు, టిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది.

కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ మరియు మెదక్ జిల్లాలలోని కొన్ని విలువైన ఆస్తులను ఆర్టీసీ ఇప్పటికే వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన తరువాత, హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో యాజమాన్యం ఆస్తులపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాలలో ఆస్తుల విలువను యాజమాన్యం అంచనా వేసింది.

అన్ని ఆస్తుల యొక్క ఖచ్చితమైన మార్కెట్ విలువ.. వివరాలను అధికారులు వెల్లడించనప్పటికీ, బస్ స్టేషన్ల సమీపంలో, బస్ డిపోలు,  గ్యారేజీల చుట్టుపక్కల ఉన్న ఖరీదైన భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ అధికారులు వందల కోట్ల రూపాయలను సంపాదించగలమన్న నమ్మకంతో ఉన్నారు. “ప్రస్తుతం, సంక్షోభాన్ని అధిగమించడానికి కార్పొరేషన్ కు ఆర్థిక సహాయం అవసరం. కార్పొరేషన్‌ను లాభదాయక సంస్థగా మార్చడానికి ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సు మార్గాలను ప్రైవేటీకరించడం.. ఆస్తులను ఎక్కువ ఆదాయ ఉత్పత్తికి ఉపయోగించడం.