తాడేపల్లి పరిధిలో పంటనష్టం.. సిపిఎం నేతల పరిశీలన

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో పంటపొలాలను సిపిఎం నాయకులు బాబురావు పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టాలంటూ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత సంవత్సరం నష్టపోయిన పంటలకు ఇంతవరకు నష్ట పరిహారం చెల్లించలేదని.. ప్రభుత్వం త్వరితగతిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. సీతానగరం ఎత్తిపోతల పథకాన్ని కూడా తెలుగుదేశం, వైసిసి పార్టీలు రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 2,500 నుంచి […]

తాడేపల్లి పరిధిలో పంటనష్టం.. సిపిఎం నేతల పరిశీలన
Follow us

|

Updated on: Oct 15, 2020 | 11:57 AM

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో పంటపొలాలను సిపిఎం నాయకులు బాబురావు పరిశీలించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టాలంటూ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత సంవత్సరం నష్టపోయిన పంటలకు ఇంతవరకు నష్ట పరిహారం చెల్లించలేదని.. ప్రభుత్వం త్వరితగతిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. సీతానగరం ఎత్తిపోతల పథకాన్ని కూడా తెలుగుదేశం, వైసిసి పార్టీలు రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆయన చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 2,500 నుంచి 3,000 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. భారీ వరదలు వర్షాల నేపథ్యంలో తమ పంటలు నీటమునిగి నష్టాల పాలయ్యామని, తమను ఆదుకోవాలని రూరల్ ప్రాంతాలు రైతులు కోరుతున్న నేపథ్యంలో బాబురావు తాడేపల్లి ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యంగా ఉద్యాన పంటలైన అరటి, దొండ, ఉల్లి, లిల్లీ పూలు, ఆకుకూరల పంటలకు భారీ నష్టం వాటిల్లిందని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు.