బాబోయ్‌..మొసలి నోట్లోకి వెళ్లి.. బతికొచ్చిన వృద్ధురాలు..!

ఒకసారి మొసలి నోటికి చిక్కిన జీవి బతికి బట్టకట్టడం కష్టమే. దొరికిన ప్రాణిని తన పదునైన పళ్లతో రక్కి పట్టేస్తుంది. ఎంతటి భారీ కాయమైనా అమాంతం నీళ్లల్లోకి లాగేసుకుని ఆరగించేస్తుంది. అటువంటి క్రూర జంతువు మొసలి నోటికి తగిలిన ఓ వృద్ధురాలు మృత్యుంజయురాలిగా బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్‌ గ్రామంలో ఓ వృద్దురాలిపై ఏకంగా రెండు మొసళ్లు ఒకేసారి దాడి చేశాయి.. వృద్ధురాలి కాలును నోట  కరిచి చెరువులోకి  లాక్కెళ్తుండగా తోటి కూలీల […]

బాబోయ్‌..మొసలి నోట్లోకి వెళ్లి.. బతికొచ్చిన వృద్ధురాలు..!
Follow us

|

Updated on: Nov 20, 2019 | 1:34 PM

ఒకసారి మొసలి నోటికి చిక్కిన జీవి బతికి బట్టకట్టడం కష్టమే. దొరికిన ప్రాణిని తన పదునైన పళ్లతో రక్కి పట్టేస్తుంది. ఎంతటి భారీ కాయమైనా అమాంతం నీళ్లల్లోకి లాగేసుకుని ఆరగించేస్తుంది. అటువంటి క్రూర జంతువు మొసలి నోటికి తగిలిన ఓ వృద్ధురాలు మృత్యుంజయురాలిగా బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్‌ గ్రామంలో ఓ వృద్దురాలిపై ఏకంగా రెండు మొసళ్లు ఒకేసారి దాడి చేశాయి.. వృద్ధురాలి కాలును నోట  కరిచి చెరువులోకి  లాక్కెళ్తుండగా తోటి కూలీల సాయంతో ప్రాణాలతో బయటపడింది. యానంబైలుకు చెందిన రత్తమ్మ మంగళవారం కూలీ పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో గ్రామంలోని లక్ష్మీదేవి చెరువు అలుగు వద్ద కాళ్లు కడుక్కునేందుకు దిగింది. ఉన్నట్టుండి కాలును ఏదో లాగుతుందని గ్రహించిన రత్తమ్మ కేకలు వేసింది. అక్కడే ఉన్న తోటి కూలీలు ఆ మొసళ్లను తరిమికొట్టడంతో అవి వృద్ధురాలిని వదిలి నీళ్లలోకి జారుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్కనే ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టులో ఉండాల్సిన మొసలి యానంబైల్‌ చెరువులో ప్రత్యక్షం కావడం, మనుషులపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్‌ అధికారులు స్పందించి చెరువులోని మొసళ్లను తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!