ఫుట్​బాలర్​​ రొనాల్డో సంపాద‌న ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే…

ఫుట్​బాల్​ చూసేవాళ్లంద‌రికీ పోర్చుగీస్ స్టార్​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని దేశాల్లో అత‌డికి అభిమానులు ఉన్నారు. దూకుడైన ఆట‌తీరుతో దశాబ్ద కాలంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు ఈ ప్లేయ‌ర్. ప్రస్తుతం అత్య‌ధికంగా డ‌బ్బు సంపాదిస్తోన్న‌ ఫుట్​బాలర్లలో ఫ‌స్ట్ ప్లేసులో ఉన్నాడు రొనాల్డో. లియోనల్ మెస్సీ, నెయిమర్​​ జూనియర్​లు అత‌డి త‌ర్వాత స్థాన‌ల్లో కొన‌సాగుతున్నారు. కోవిడ్-19 విప‌త్క‌ర ప‌రిస్థితుల కార‌ణంగా ఫుట్​బాల్​ క్లబ్​ జువెెంటిస్ శాల‌రీస్ కోతలకు రొనాల్డో అంగీకరించాడు. అయినా […]

ఫుట్​బాలర్​​ రొనాల్డో సంపాద‌న ఎంతో తెలిస్తే షాక్ తినాల్సిందే...
Follow us

|

Updated on: Jun 03, 2020 | 9:33 AM

ఫుట్​బాల్​ చూసేవాళ్లంద‌రికీ పోర్చుగీస్ స్టార్​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని దేశాల్లో అత‌డికి అభిమానులు ఉన్నారు. దూకుడైన ఆట‌తీరుతో దశాబ్ద కాలంలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు ఈ ప్లేయ‌ర్. ప్రస్తుతం అత్య‌ధికంగా డ‌బ్బు సంపాదిస్తోన్న‌ ఫుట్​బాలర్లలో ఫ‌స్ట్ ప్లేసులో ఉన్నాడు రొనాల్డో. లియోనల్ మెస్సీ, నెయిమర్​​ జూనియర్​లు అత‌డి త‌ర్వాత స్థాన‌ల్లో కొన‌సాగుతున్నారు. కోవిడ్-19 విప‌త్క‌ర ప‌రిస్థితుల కార‌ణంగా ఫుట్​బాల్​ క్లబ్​ జువెెంటిస్ శాల‌రీస్ కోతలకు రొనాల్డో అంగీకరించాడు. అయినా ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తోన్న ఫుట్​బాల్​ ప్లేయ‌ర్ గా అతడి ప్లేస్ స్థిరంగానే ఉంది. మ‌రోవైపు వ‌రల్డ్ వైడ్ ఎక్కువ ఆర్జిస్తున్న అథ్లెట్ల జాబితాలో టెన్నిస్​ స్టార్​ రోజర్​ ఫెదరర్​ టాప్ లిస్టులో ఉన్నాడు.

ఫోర్బ్స్​ రిపోర్టు ప్రకారం ఫుట్​బాల్​ ప్లేయ‌ర్ల‌ కరోనా కారణంగా వేతనాల్లో కోత ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ లోటు వల్ల ప్లేయ‌ర్స్ శాల‌రీస్ లో కోతలు పెడుతున్నాయి క్లబ్​లు. 2019లో జీతాలతో పోల్చుకుంటే ఫుట్​బాల్​ ప్లేయ‌ర్ల‌కు ప్రస్తుతం 9 శాతం కోత విధించారు.

ఫుట్​బాల్​ ప్లేయర్లలో అత్యధికంగా ఆర్జించే వారి వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…

1. క్రిస్టియానో రొనాల్డో – రూ.804.2 కోట్లు (రూ.450 కోట్ల శాల‌రీ, రూ.345.73 కోట్ల విలువైన ప్ర‌క‌ట‌న‌లు) 2. లియోనల్ మెస్సీ – రూ.774.14 కోట్లు (రూ.533 కోట్ల శాల‌రీ, రూ.232.9 కోట్ల విలువైన ప్రకటనలు) 3. నెయిమర్​ జూనియర్​ – రూ.706.5 కోట్లు (రూ.526 కోట్ల శాల‌రీ, రూ.180 కోట్ల విలువైన ప్రకటనలు)