ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా కేసు నమోదు

ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా గ్రూప్స్‌లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ..

ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Feb 28, 2020 | 8:27 AM

ట్విట్టర్, వాట్సాప్, టిక్‌టాక్‌లపై దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా గ్రూప్స్‌లో కొందరు సున్నితమైన, మతపరమైన అంశాలను రెచ్చగొడుతూ, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్ శ్రీశైలం అనే సీనియర్ జర్నలిస్ట్ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. వాటిపై కేసు పెట్టాలంటూ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

గతేడాది డిసెంబర్ 12న భారత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా సదరు సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనాన్ని ధిక్కరిస్తూ దేశ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని జర్నలిస్ట్ శ్రీశైలం హైదరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నగర పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. అలాగే కొన్ని వాట్సాప్ గ్రూప్, టిక్‌ టాక్ వీడియోలు, ట్వీట్ల వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం సైబర్ క్రైమ్ పోలీసులకు రిఫర్ చేశారు. దీంతో వారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 153A, 121 A, 124, 124A, 294, 295 A, 505, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 200, సెక్షన్ 66A కింద కేసులు నమోదు చేశారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!