చేతబడి చేశాడన్న కారణంతో.. గొడ్డళ్లతో నరికి.. సజీవదహనం

హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట అద్రాస్ పల్లిలో దారుణం జరిగింది. చేతబడి చేశాడన్న నెపంతో యువకుడు ఆంజనేయులు(24) దారుణ హత్యకు గురయ్యాడు. అద్రాస్ పల్లి గ్రామంలో ఓ మహిళను చేతబడి చేసి చంపేశాడన్న కారణంగా ఆమె కుటుంబసభ్యులు ఓ యువకుడిపై దాడి చేశారు. అనంతరం అదే మహిళ చితిపై అతన్ని సజీవ దహనం చేశారు. గ్యార లక్ష్మీ అనే మహిళ గత కొన్నిరోజులుగా.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. అదేరోజు సాయంత్రం ఆమెకు దహన సంస్కారాలు చేశారు. అయితే.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:20 pm, Thu, 19 September 19
చేతబడి చేశాడన్న కారణంతో.. గొడ్డళ్లతో నరికి.. సజీవదహనం

హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట అద్రాస్ పల్లిలో దారుణం జరిగింది. చేతబడి చేశాడన్న నెపంతో యువకుడు ఆంజనేయులు(24) దారుణ హత్యకు గురయ్యాడు. అద్రాస్ పల్లి గ్రామంలో ఓ మహిళను చేతబడి చేసి చంపేశాడన్న కారణంగా ఆమె కుటుంబసభ్యులు ఓ యువకుడిపై దాడి చేశారు. అనంతరం అదే మహిళ చితిపై అతన్ని సజీవ దహనం చేశారు.

గ్యార లక్ష్మీ అనే మహిళ గత కొన్నిరోజులుగా.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. అదేరోజు సాయంత్రం ఆమెకు దహన సంస్కారాలు చేశారు. అయితే.. అదే గ్రామానికి చెందిన.. ఆంజనేయులు చేతబడి చేసిన కారణంతోనే.. లక్ష్మీ మృతి చెందిందని భావించిన కుటుంబసభ్యులు.. దహన సంస్కారాలకు యాదృచ్ఛికంగా వచ్చిన ఆంజనేయులను విచక్షణారహితంగా గొడ్డళ్లతో దాడిచేసి.. చంపేశారు. అనంతరం అతన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. మృతురాలు.. లక్ష్మీ చితిపైనే పేర్చారు.

చేతబడి అనుమానంతోనే ఆంజనేయులను చంపేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లడం ఆంజనేయులకి అలవాటని.. కానీ మృతురాలి బంధువులు చేతబడి అన్న అనుమానం పెంచుకుని చంపేసి ఉంటారని చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.

ఈ విషయంపై స్పందించిన బాలానగర్ డీసీపీ పద్మజ.. డెత్‌స్పాట్‌ను పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించిన అనుమానితులను త్వరలో పట్టుకుంటామన్నారు. ఇది చేతబడి అనుమానంతోనే చంపారా.. లేక మరో కారణం ఉందా అన్నదానిపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ కేసులో స్థానికులు చెబుతున్న అనుమానిత వ్యక్తి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని..  బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు.