ప్రాణాల మీదకు తెచ్చిన ‘లూడో’ గేమ్‌.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఆడే లూడో గేమ్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. లూడోలో తనను ఓడిస్తున్నాడని అసహనానికి గురైన ఓ యువకుడు మరో వ్యక్తిపై మద్యం సీసాతో దాడి చేశాడు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:17 pm, Tue, 30 June 20
ప్రాణాల మీదకు తెచ్చిన 'లూడో' గేమ్‌.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఆడే లూడో గేమ్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. లూడోలో తనను ఓడిస్తున్నాడని అసహనానికి గురైన ఓ యువకుడు మరో వ్యక్తిపై మద్యం సీసాతో దాడి చేశాడు. దీంతో ఆ వ్యక్తి మెడ, పొత్త కడుపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి  సమయంలో కోలా గోపి, వట్టికొండ నాగేశ్వరావు అనే ఇద్దరు యువకులు మద్యం తాగుతూ లూడో గేమ్‌ ఆడారు. రూ.50 బెట్టింగ్ పెట్టి ఆడిన ఆటలో గోపి వరుసగా రెండు సార్లు ఓడిపోయాడు. అయినప్పటికీ ఆ తరువాత రూ.500లు బెట్టింగ్‌ పెట్టేందుకు గోపి సిద్దమయ్యాడు. అందుకు నాగేశ్వరరావు, గోపిని కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో అసహనానికి గురైన గోపి పక్కనే ఉన్న మద్యం సీసాతో నాగేశ్వరావు మెడ, పొత్తికడుపుపై దాడి చేశాడు. దీంతో నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీనిపై నాగేశ్వరావు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండలరావు తెలిపారు.