Andhra Pradesh: పట్టపగలే కిడ్నాప్.. పోలీసులకు దొరకని క్లూ.. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ

ఒక వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటన జరిగి దాదాపు 30గంటలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆస్తి వివాదంలో ఈ కిడ్నాప్ జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు మాత్రం...

Andhra Pradesh: పట్టపగలే కిడ్నాప్.. పోలీసులకు దొరకని క్లూ.. అనంతపురంలో తీవ్ర ఉత్కంఠ
Kidnap In Rayadurgam
Follow us

|

Updated on: Aug 08, 2022 | 6:36 PM

ఒక వ్యక్తి పట్టపగలు అందరూ చూస్తుండగా కిడ్నాప్ కు గురయ్యాడు. ఈ ఘటన జరిగి దాదాపు 30గంటలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆస్తి వివాదంలో ఈ కిడ్నాప్ జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతుండగా పోలీసులు మాత్రం ట్రేస్ చేయలేకపోతున్నారు. అనంతపురం (Anantapur) జిల్లా రాయదుర్గంలో జరిగిన కిడ్నాప్ గురైన వ్యక్తి ఎక్కడ..? ఎవరు కిడ్నాప్ చేశారు..? అనే ప్రశ్నలు అంతుచిక్కనివిగా మారాయి. అనంతపురం జిల్లాలో ఒక భూస్వామి కిడ్నాప్ కు గురైన సంఘటన కలకలం రేపుతోంది. బళ్లారి (Ballari) రోడ్డు కుంటి మారెమ్మ దేవాలయం వద్ద పట్టణానికి చెందిన సిద్ధేశ్వర అనే 52 ఏళ్ల వ్యక్తి కిడ్నాప్ గురయ్యాడు. సిద్ధేశ్వర ద్విచక్ర వాహనంలో వ్యవసాయ పొలంలో కూలి పని చేస్తున్న వారికి మధ్యాహ్న భోజనం తీసుకెళ్తుండగా పట్టణ శివారు ప్రాంతమైన బళ్లారి రోడ్ కుంటి మారెమ్మ దేవాలయం వద్ద పట్టపగలు ప్రజలు చూస్తుండగా కిడ్నాప్ చేశారు. తెల్ల స్కార్పియోలో వచ్చిన దుండగలు సిద్దాను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై బాధితుని తండ్రి కూన తిప్పేస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బళ్లారిలో ఉన్న చెల్లలు భర్త సుమారు 2కోట్ల వరకు అప్పులు చేశాడు. దీనిపై సిద్ధేశ్వర పలుసార్లు పంచాయతీ చేశాడు. చేసిన అప్పు చెల్లించకపోవడంతో చెల్లలు భర్తకు బదులుగా సిద్దాను కిడ్నాప్ చేయించినట్లు బాధితుని తండ్రి, కూనా తిప్పేస్వామి ఫిర్యాదు చేశారు. అయితే కిడ్నాప్ జరిగి ఇప్పటికే 30 గంటలు కావస్తోంది. అందునా పట్టపగలు జరిగింది. అందరూ చూస్తుండగా జరిగింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం చిన్నక్లూ కూడా సంపాదించలేకపోయారు. దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

నిత్యం వాహనాల రాకపోకలు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. పోలీసులు మాత్రం కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఇప్పటికే మూడు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఇందులో ఒక టీం కర్ణాటక ప్రాంతానికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. గంటగంటకూ బాధితుని కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కిడ్నాప్ కు గురైన వ్యక్తి నుంచి ఎలా ఫోన్ కాల్ రాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?