మరికొన్ని గంటల్లో వివాహం.. మేకప్ కిట్ కోసం సిటీకెళ్లిన పెళ్లి కుమార్తె.. ఇంతలో ఎవరూ ఊహించని ట్విస్ట్..!

Anantapur Bride Kidnap: కాసేపట్లో పెళ్లి.. బంధుమిత్రులంతా అప్పటికే వచ్చేశారు. మేకప్ కిట్‌ కోసం వెళ్లిన పెళ్లి కుమార్తె.. ఆ తర్వాతే మొదలైంది లొల్లి.. అసలు ఏం జరిగిందంటే...

  • Ravi Kiran
  • Publish Date - 8:45 am, Sat, 27 February 21
మరికొన్ని గంటల్లో వివాహం.. మేకప్ కిట్ కోసం సిటీకెళ్లిన పెళ్లి కుమార్తె.. ఇంతలో ఎవరూ ఊహించని ట్విస్ట్..!

Anantapur Bride Kidnap: మరికొద్ది గంటల్లో పెళ్లి. వివాహ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు.. బంధుమిత్రులంతా అప్పటికే వచ్చేశారు. పెళ్లి మండపంలో కూర్చుని బంధువులంతా ఫుల్‌గా సరదాగా ఉన్నారు. పెళ్లి కుమార్తె(Bride) తన గదిలో కూర్చుని రెడీ అవుతుండగా కొంత మేకప్ సామాను మిస్సయినట్టు గుర్తించింది. పెళ్లికి రెడీ కావాలంటే అవి ఉండాల్సిందేనని ఫిక్సయ్యింది. వివాహానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది కదా అని స్కూటీ తీసుకుని తాను ఒక్కటే బయటకు వచ్చింది. మేకప్‌కు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు పక్కనే ఉన్న సిటీకి వెళ్లింది. కానీ.. ఆమె తిరిగి ఇంటికి రాలేదు. (Bride Kidnap In Anantapur Crime Story)

లవ్ ఎఫైర్ ఏదైనా ఉండి ఉంటుంది.. అందుకే పెళ్లి నచ్చక.. ప్రియుడితో కలిసి వెళ్లిపోయి ఉంటుందని అనుకుంటే పొరపాటే. అటువంటిదేమి లేదు.. ఆమె ఎవరితోనూ వెళ్లిపోలేదు. తన బంధువులే పక్కా స్కెచ్ వేసి మరీ ఆమెను కిడ్నాప్ చేశారు. (Anantapur Bride Kidnap) కాగా, వధువు సిటీకి వస్తోందని సమాచారం తెలుసుకున్న పెళ్లికూతురు బావ..మరో ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతపురం(Anantapur) జిల్లాలో చోటుచేసుకుంది.పెళ్లికూతురు ఎంతకీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. (Andhra Pradesh Crime News)

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!