ప్రియురాలిపై మిత్రుడితో కలిసి సామూహిక అత్యాచారం.. ఆపై హత్య

మనసిచ్చి మనువాడాడు. కలకాలం తోడుంటానన్నాడు. అంతలోనే అనుమానం పెంచుకుని అత్యంత పాశవికంగా హతమార్చాడు. ప్రేమ అనే పదానికే మాయని మచ్చ తీసుకువచ్చాడు దుర్మార్గుడు. తన స్నేహితుడితో కలసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి.. దారుణంగా హత్య చేశాడు. అనంతరం రెండురోజుల్లో తానూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రియురాలిపై మిత్రుడితో కలిసి సామూహిక అత్యాచారం.. ఆపై హత్య
Follow us

|

Updated on: Aug 31, 2020 | 3:11 PM

మనసిచ్చి మనువాడాడు. కలకాలం తోడుంటానన్నాడు. అంతలోనే అనుమానం పెంచుకుని అత్యంత పాశవికంగా హతమార్చాడు. ప్రేమ అనే పదానికే మాయని మచ్చ తీసుకువచ్చాడు దుర్మార్గుడు. తన స్నేహితుడితో కలసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి.. దారుణంగా హత్య చేశాడు. అనంతరం రెండురోజుల్లో తానూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలానికి చెందిన ఆ యువతి కనిపించడం లేదని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వలిగొండ మండలం గొల్నెపల్లి గ్రామానికి చెందిన మిర్యాల రవి సమీప కర్మాగారంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన యువతితో కొన్ని నెలల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా, ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటోందని రవి అనుమానం పెంచుకున్నాడు. తనను పక్కనే పడుతుందన్న అనుమానంతో ఆమెను అంతమొందించేందుకు తన స్నేహితుడు చిన్నపాక రవితేజతో కలిసి పథకం పన్నాడు.

ఇదిలావుండగా, తన అక్కర కోసం డబ్బులు కావాలని యువతి రవిని కోరింది. దీంతో డబ్బుల సాయం చేస్తానంటూ ఈ నెల 18న ఆమెను పిలిచాడు. ఆమె తన తల్లితో కలిసి ద్విచక్ర వాహనంపై వలిగొండకు వచ్చి ఆసుపత్రిలో తల్లికి వైద్యపరీక్షలు చేయించింది. అనంతరం మార్కెట్‌ వద్ద తల్లిని వదిలి.. వలిగొండలోని వలిపాషాగుట్ట వద్దకు వెళ్లింది. అక్కడ ఆమెపై రవి, రవితేజలు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని పక్కనే చెట్లపొదలో పడేసి కంప కప్పి యధావిధిగా అక్కడి నుంచి పారిపోయారని డీసీపీ కె.నారాయణరెడ్డి వివరించారు.

యువతిని హత్య చేసిన అనంతరం రవి తన ద్విచక్ర వాహనంపై, రవితేజ మృతురాలి స్కూటీపై భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వరకు కలిసి వచ్చారు. అక్కడి నుంచి రవితేజ హైదరాబాద్‌కు, మిర్యాల రవి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి విడిపోయారు. ఇదిలావుంటే, రవి మృతదేహాన్ని ఈ నెల 20న నాగిరెడ్డిపల్లి శివారులో స్థానికులు గుర్తించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, యువతి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఈ నెల 19న ఆమె తండ్రి వలిగొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారాలతో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ నెల 29న రవితేజను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. హత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు రవి మృతి చెందడంతో.. ఏ2 రవితేజపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు వివిధ సెక్షన్లు నమోదు చేశారు. నిందితుడిని జ్యుడీషియల్‌ రిమాండుకు పంపినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రధాన నిందితుడి మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.