సీనియర్​ రైల్వే అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగం

మరో రైల్వే లంచావతారం పట్టుబడ్డాడు. సీనియర్​ రైల్వే అధికారి మహేంద్రసింగ్​ను సీబీఐ అరెస్టు చేసింది. కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు మహేంద్ర సింగ్ అభియోగాలున్నాయి. నేపథ్యంలో..

  • Sanjay Kasula
  • Publish Date - 7:40 pm, Sun, 17 January 21
సీనియర్​ రైల్వే అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగం

Alleged Bribery : మరో రైల్వే లంచావతారం పట్టుబడ్డాడు. సీనియర్​ రైల్వే అధికారి మహేంద్రసింగ్​ను సీబీఐ అరెస్టు చేసింది. కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు మహేంద్ర సింగ్ అభియోగాలున్నాయి. నేపథ్యంలో నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు.. మహేంద్రసింగ్‌ను అరెస్టు చేశారు.

కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సీనియర్ రైల్వే అధికారి మహేంద్రసింగ్‌ను.. సీబీఐ అధికారులు అరెస్టు చేసింది. 1985 బ్యాచ్ ఐఆర్​ఈఎస్​ అధికారి మహేంద్ర సింగ్ చౌహాన్‌ ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్నారు.

రైల్వే ప్రాజెక్టు కాంట్రాక్టులను మంజూరు చేసేందుకు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగాల నేపథ్యంలో.. నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు.. మహేంద్ర సింగ్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, అసోం, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

భారీ డిస్కౌంట్ ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా.. ఒక్కో వాహనంపై ఎంత తగ్గింపు అంటే…

Cooked Chicken : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. ఇలా చేసి తినమంటు సూచనలు చేసిన కేంద్రం