Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సు – ట్రక్కు ఢీః.. 8 మంది మృతి

Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేటు బస్సు - ట్రక్కు ఢీః.. 8 మంది మృతి
Road Accident
Subhash Goud

|

Sep 28, 2022 | 10:19 AM

Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది వరకు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డా.. తీవ్ర ఇబ్బందులతోనే జీవిస్తున్నారు. తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లఖీంపూర్‌భేరిలో ఓ ప్రైవేటు బస్సు – ట్రక్కు ఢీకొని 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇక క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  అధికారులను ఆదేశించింది. అవసరం అనుకుంటే మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రమాదాలు జరుగకుండా కఠినమైన నిబంధనలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలున్నాయి. మద్యం తాగి వాహనాలు పడపడం, ఓవర్‌టెక్‌, అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నారు.

కాగా, రెండు రోజుల కిందట ఇదే యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దసరా శరన్నవరాత్రుల తొలి రోజునే అక్కడ ఘోర ప్రమాదం జరగడం దుదరృష్టకరం. భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ సీతాపూర్‌లోని అట్టారియా నివాసితులుగా గుర్తించారు. నవరాత్రి ఉత్సవాల తొలిరోజు చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు అట్టారియాకు చెందిన ఓ కుటుంబం ఉన్నై దేవి ఆలయానికి ట్రాక్టర్‌లో బయలుదేరింది. ట్రాక్టర్‌లో చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కలిపి మొత్తం 47 మంది ఉన్నారు. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ (లక్నో) సూర్య పాల్ గంగ్వార్ వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా సూర్య పాల్ గంగ్వార్ తెలిపారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ లక్నో శివార్లలోని ఇటౌంజా ప్రాంతంలో.. ప్రధాన రహదారిపై నుంచి జారి చెరువులో పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. చెరువు దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం చెరవేశారు. మొత్తంగా 37 మందిని రక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu