అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం.. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి 17 మందికి గాయాలు..

Accident : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటో

  • uppula Raju
  • Publish Date - 9:57 am, Sun, 17 January 21
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం.. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి 17 మందికి గాయాలు..

Accident : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తాపడింది. దీంతో ఒకరు మృతిచెందగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూలి పనుల కోసం 18 మంది కొనకొండ్ల నుంచి ఈ తెల్లవారుజామున ఆటోలో గుమ్మనూరు బయల్దేరారు.

రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండటంతో రహదారికి అడ్డంగా మట్టి కుప్పలు వేశారు. వీటిని గమనించకుండా డ్రైవర్‌ వేగంగా నడపటంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టి కొంతమంది క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పండగ పూట ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

Road Mishap: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తా పడిన కారు.. ఇద్దరు స్పాడ్ డెడ్..

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. అదుపు త‌ప్పి బోల్తా ప‌డ్డ ట్రాక్ట‌ర్‌.. ముగ్గురు దుర్మ‌ర‌ణం