బుద్ధిగా ఉండండి.. రౌడీషీట్లను తొలిగించిన పోలీసులు

చాలా కాలంపాటు ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా ఉంటున్న 31 మంది రౌడిషీటర్లపై ఉన్న రౌడీషీట్లను పోలీసులు తొలిగించారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళాను సాలార్‌జుంగ్ మ్యూజియంలో జరిగింది. పాతబస్తీలో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లోంచి తొలగించామన్నారు. వీరంతా కొత్త జీవితాన్ని గడిపేందుకు అవకాశం కలిపించామని వెల్లడించారు. గతంలో వీరంతా […]

బుద్ధిగా ఉండండి.. రౌడీషీట్లను తొలిగించిన పోలీసులు

చాలా కాలంపాటు ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా ఉంటున్న 31 మంది రౌడిషీటర్లపై ఉన్న రౌడీషీట్లను పోలీసులు తొలిగించారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడించారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళాను సాలార్‌జుంగ్ మ్యూజియంలో జరిగింది. పాతబస్తీలో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లోంచి తొలగించామన్నారు.

వీరంతా కొత్త జీవితాన్ని గడిపేందుకు అవకాశం కలిపించామని వెల్లడించారు. గతంలో వీరంతా తప్పులు, నేరాలు చేసి జైలుకి వెళ్లిన వారు… కానీ, ఇప్పుడు బుద్ధిగా ఉంటున్నారని చెప్పారు. వీరిపై ఉన్న రౌడీషీట్లు తొలగిపోవడంతో అందరికీ ఆదర్శంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుతున్నారు. సమాజంలో మంచిగా మెలగండి… బాధ్యతగా ప్రవర్తించండి అంటూ కోరారు. తిరిగి ఎలాంటి నేరాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మళ్లీ జైలుకు వెళతారని సీపీ హెచ్చరించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu