Crime: కోట్లాది రూపాయల ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. నలుగురు స్మగ్లర్ల అరెస్ట్

Red Sandle Smuglers: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే.. ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకొని..

Crime: కోట్లాది రూపాయల ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
Red Sandle Smuglers

Red Sandle Smuglers: ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల గుట్టురట్టు చేశారు. కోట్లాది రూపాయలు విలువ చేసే.. ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకొని.. నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు రూ.2 కోట్ల విలువైన ఆరు టన్నుల 182 ఎర్ర చందనం దుంగలు, ఒక లారీ, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు సమీపంలోని పెనుమూరు క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడినట్లు వెల్లడించారు. అయితే వారిని ఛేజింగ్ చేసి మరి పట్టుకున్నట్లు చిత్తూరు పోలీసులు తెలిపారు.

పెనుమూరు క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తిరుపతి వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న స్మగ్లింగ్ వాహనాలు పోలీసులపైకి దూసుకెళ్లాయి. ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న పోలీసులు.. వెంటనే పారిపోతున్న వాహనాలను వెంబడించి పట్టుకున్నారు. అరెస్టయిన వారిలో కడప జిల్లాకు చెందిన శివయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ క్రిష్ణయ్య, తిరుపతికి చెందిన ఎ.కిరణ్, తమిళనాడు వెల్లూరుకు చెందిన వి.బాలాజీ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: