భర్తను ముక్కలుగా నరికి మురికికాల్వలో వేసిన భార్య

భర్తను ముక్కలుగా నరికి మురికికాల్వలో వేసిన భార్య

రాజస్తాన్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చింది భార్య. భర్త మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మురుగునీటి శుద్ధి కర్మాగారంలో పడేసింది.

Balaraju Goud

|

Aug 14, 2020 | 6:16 PM

రాజస్తాన్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చింది భార్య. భర్త మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మురుగునీటి శుద్ధి కర్మాగారంలో పడేసింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఘటన సంచలన కలిగించింది. అటు, హత్య కేసు మిస్టరీని 48 గంటల్లోనే ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.

జోధ్‌పూర్‌లోని నందాడి సీవరేజ్‌ ట్రీట్మెంట్ ప్లాంట్‌ సమీపంలోని మురికి కాలువలో రెండు బాక్సులను బుధవారం స్థానికులు గుర్తించారు. వాటిలో మనిషి అవయవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. స్థానికంగా నివసించే సుశీల్‌ అలియాస్‌ చరణ్‌ సింగ్‌ మిస్సయినట్లు గుర్తించారు. ఈ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాలు బయటపడటంతో షాక్ కు గురయ్యారు. తానే భర్తను చంపినట్లు సుశీల్‌ భార్య పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది.

తన అక్కాచెల్లెళ్లు, ఫ్రెండ్‌ సాయంతో సుశీల్‌ను తమ ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి సీవరేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌లో పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు పోలీసులు. ఈ ఘటనలో నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనాస్థలిలో లభించిన మృతుడి బైక్‌, ప్రత్యక్ష సాక్షుల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా స్వల్పకాలంలోనే కేసును ఛేదించినట్లు పేర్కొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu