ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని మోసం..ఏసీబీకి చిక్కిన కేటుగాడు

ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఓ కేటుగాడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇంగ్లీషుపాలేనికి చెందిన హఫీజ్ గతంలో జిల్లా కోర్టులో పనిచేసినట్లుగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తాంటూ నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తీసుకుని నెలల తరబడిగా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి […]

ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని మోసం..ఏసీబీకి చిక్కిన కేటుగాడు
Follow us

|

Updated on: Jun 20, 2020 | 10:40 AM

ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఓ కేటుగాడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇంగ్లీషుపాలేనికి చెందిన హఫీజ్ గతంలో జిల్లా కోర్టులో పనిచేసినట్లుగా తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తాంటూ నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బు తీసుకుని నెలల తరబడిగా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నింధితుడు హఫీజ్ ను వలపన్ని పట్టుకున్నారు. హఫీజ్ నుంచి మరిన్ని వివరాలు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.