తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు.. అమాయకపు ప్రజలను దోచుకుంటున్న చిటీగాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. తాజాగా హైదరాబాద్‌లోని..

తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు.. అమాయకపు ప్రజలను దోచుకుంటున్న చిటీగాళ్లు
Follow us

|

Updated on: Apr 15, 2021 | 10:23 PM

తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉండే అమాయక మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా ఉడాయిస్తున్నారు చీటర్లు. తాజాగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో మరో మోసం బయట పడింది.హైదరాబాద్ లో చిట్టీల మోసాలు పెరిగిపోతున్నాయి. బడా కంపెనీల నుంచి ఇంటి దగ్గర వుండే మహిళల వరకు చిట్టీల పేరుతో అమాయకపు ప్రజల నుంచి దోచుకుంటున్నారు..

హైదరాబాద్‌లో నెలకు 200 రూపాయల నుంచి రెండు కోట్ల వరకు లావాదేవీలు నిర్వహిచే చిట్టీలు ఉన్నాయి.. పెద్ద పెద్ద కంపెనీల నుండి ఇంటి దగ్గర ఉండే సామాన్య స్త్రీలు, పురుషులు చిట్టీలు వేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య చిట్టిల పేరుతో మోసాలకు పాల్పడే ఘటనలు పెరిగిపోతున్నాయి.. కొంతమంది వారి పిల్లల పెళ్లిళ్ల కోసం, మరికొందరు ఇల్లు కట్టుకోవడం కోసం చిట్టీలు వేస్తూ ఉంటారు.. అయితే కొందరు మొదట నమ్మకంగా ఉంటూ చిట్టీలో భారీగా డబ్బులు వసూలు కాగానే, తిరిగి చెల్లించే సమయంలో ఉడాయిస్తున్నారు. చిట్టీలు వేసిన వారిని మోసం చేస్తున్నారు..

అయితే చిట్టీలు వేసే సమయంలో బాగా నమ్మకస్తుల దగ్గర మాత్రమే వెయ్యాలని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి.. వాళ్ళు మీద 420 సెక్షన్ కింద కేసు పెట్టినా.. వారిపై ఆరు నెలలో.. మూడేళ్లో శిక్ష పడుతుంది.. కానీ మీరు పోగొట్టుకున్న డబ్బు మీకు తిరిగి రాదు కనుక ముందు నుంచే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసినా మీరు నష్టపోయిన సొమ్ములు పూర్తిగా వచ్చే అవకాశం లేదు. మోసం చేసిన వారి దగ్గరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బులో బాధితులకు తల కొంత ముట్టజెపుతారు. దీంతో చిట్టీలు వేసే సమయంలో బాగా నమ్మకస్తుల దగ్గరే చిట్టీలు వేయాలని, మోసం పోయాక బాధపడితే లాభం లేదని పోలీసులు చెబుతున్నారు. చిట్టీలు వేసే వ్యక్తులు ఆ ప్రాంతంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? గతంలో వారి బ్యాగ్రౌండ్‌ ఎలా ఉంది ? చిట్టీల డబ్బులు తిరిగి చెల్లించే వారేనా ? అనేది చిట్టీలు వేసేవారు ముందుగానే గ్రహించాలని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: ED Pulls ESI Scam: జ్యువెలర్స్ షోరూమ్‌లో స్విచ్ వేస్తే.. తెలంగాణ కార్మిక శాఖ పేషీలో లైటు వెలిగింది.. ESI స్కామ్ లో థ్రిల్లర్‌ మూవీ క్లైమాక్స్

 Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..